మనకి సముద్రం అనగానే గుర్తుకు వచ్చేది సీ ఫుడ్. ఈ సీ ఫుడ్ లో అందరూ ఎక్కువ ఇష్టంగా తినేది చేప.ఈ చేపలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అందులో కొన్ని అరుధైన చేపలు కూడా ఉన్నాయి. ఈ అరుదైన చేపలో ఒకటి "బంగారు చేప". దీనిని కచ్చేరీ చేప అనికూడా అంటారు.ఈ చేప దొరికితే చాలు లక్షాధికారులు అవుతారు. అసలు ఈ చేప కథ ఏంటో చూద్దాం. ఈ అరుదైన చేప తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో మత్స్యకారుని లక్షాధికారుల్ని చేసింది . 30 కిలోల కచ్చేరి చేప వారికి దొరకడంతో వాళ్ళు చాలా ఆనందపడ్డారు.ఈ కచ్చేరీ చేప మామూలు సాదా సీదా చేప కాదండోయ్ సముద్రంలో బహు అరుదుగా కనిపించేది. దీని ధర లక్షల్లో పలుకుతుంది.


ఇటీవలే ఈ చేప తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ తీరంలో మత్స్యకారుల వలకి చిక్కి వారిని లక్షాధికారులని చేసింది. ఈ చేపను ఓ వ్యాపారి రెండు లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు.ఈ చేప అంత ధర పలకడం ఏంటి అని అనుకుంటున్నారా. పెట్రోల్ఫియా డైయా కాన్సెస్ సాంకేతిక నామం కలిగిన కచ్చేరీ చేప ఒక చోటునుంచి మరో చోటుకు వలస వెళ్తుంది. గోల్డ్ ఫిష్ గా పేరున్న ఈ చేప వలకి చిక్కితే మత్స్యకారుల ఇంట సిరుల పంట పండినట్టే.ఎపుడో ఒక సారిగాని ఇలాంటి చేప దొరకదని అదృష్టవంతులకే అది దొరుకుతుందని మత్స్యకారులు చెప్తున్నారు.ఈ చేప గుంటలో దొరుకుతుందని,30-25 మీటర్ల లోపలే ఉంటాయి.ఇందులో బ్లాక్ ,గోల్డ్ రంగులో ఈ చేపలు ఉంటాయి. అవి బాగా ధర ఎక్కువ.


అందులో ఉన్న చర్మం కన్నా తూత బాగా ధర ఎక్కువ.ఈ చేప అనేది గుంటలోని ప్రదేశాలు లోనే దొరుకుతుంది.ఈ చేప దొరికితే చాలా అదృష్టం ఎందుకంటే దాని నెట్ వాల్యూ ఎక్కువ.చేప ఖరీదు ఏమి ఉండదు కాని దాంతో మెడిసిన్ తయారవుతుందని ,దీంట్లో ఔషద గుణాలు ఉన్నాయని చెప్తున్నారు మత్స్యశాఖాధికారులు.ఆ చేపలో గాల్బ్లాడర్ అనేది ఒకటుంటుంది.ఐతే ఆ గాల్బ్లాడర్ కి మంచి మెడిసిన్ వ్యాల్యూ ఉంటుంది.శరీరానికి గాయాలైనప్పుడు కుట్లు వేస్తారు. ఆ కుట్లకి ఈ గాల్బ్లాడర్ ను వాడటం వల్ల ఆ  కుట్లు తీయకుండానే దాన్లో కరిగిపోతాయి అని చెప్తునారు మన మత్స్యశాఖాధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: