యాంకర్ సుమ.. తెలుగు ప్రేక్షకులకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌డం అవ‌స‌రం లేని పేరు. ఎందుకంటే.. రెండు దశాబ్ధాలుగా ఈమె బుల్లితెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. వయసు న‌ల‌బై దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను అందుకునే శక్తి కానీ.. దాటే అర్హత కానీ ఎవరికీ కనిపించడం లేదు అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. టాలీవుడ్‌లో ఏ సినిమా ఫంక్షన్ జరగాలన్నా గెస్ట్‌లు సంగతి తరువాత ముందు సుమకు డేట్ ఖాళీగా ఉందో లేదో చూస్కోవల్సిన పరిస్థితి. అంత‌లా ఈమె యాంక‌రింగ్‌లో క్రేజ్ సంపాదించుకుంది. 

 

ఇక  సుమ చేసే షోలలో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ను ఇచ్చే షో ఏదన్నా ఉంది అంటే.. అది ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే `క్యాష్`  ప్రోగ్రాం అని చెప్పాలి. ప్రతి శ‌నివారం రాత్రి 9:30 గంటలకు వ‌చ్చే ఈ షో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌లా న‌వ్విస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఈ వారం రాబోయే క్యాష్ షోలో ట్రిపుల్ ఎంటర్టైన్మెంట్ ల‌భించ‌నుంది. అదేంటి అనుకుంటున్నారా..? అస‌లు విష‌యం ఏంటంటే.. ఈ శ‌నివారం టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్ కు ఈటీవీ సెన్సేషనల్ కామెడీ షోలు అయినటువంటి “జబర్దస్త్” మరియు “ఎక్స్ట్రా జబర్దస్త్” ప్రోగ్రాం నటులు వస్తున్నారు.

 

దీనికి సంబంధించిన ప్రోమో ఇప్ప‌టికే ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోంది. ఈ ప్రోమోలో బులెట్ భాస్కర్,కార్తీక్, అప్పారావు,ఫసక్ శశి, నరేష్ నేహంత్ లతో క్యాష్ స్టేజ్ పై చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక చివరలో ఈటీవీ వార్తలను తలపించే విధంగా  క్యాష్ వార్తలు స్కిట్ మంచి హిలేరియస్ గా న‌వ్వించ‌నున్నాయి. దీనిని బ‌ట్టి చూస్తుంటే.. గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్ మ‌రియు శుక్రవారం ప్రసారం అయ్యే  ఎక్స్ట్రా జబర్దస్త్  రెండు షోల తాలూకా ఎంటర్టైన్మెంట్‌కు క్యాష్ ఎంటర్టైన్మెంట్ తోడవ్వడంతో.. శ‌నివారం రాబోయే ఆ ఒక్క ఎపిసోడ్‌లోనే అద్భుత‌మైన హిలేరియస్ కామెడీని చూడ‌వ‌చ్చు. కాబ‌ట్టి ఈ శ‌నివారం క్యాష్ ప్రోగ్రామ్‌ను మాత్రం మిస్ కాకండే..!!

    

మరింత సమాచారం తెలుసుకోండి: