అవును మీకు ఈ షో గుర్తుందా? పట్టుకుంటే పట్టుచీర. అప్పట్లో పట్టు చీరలు చాలా కాస్టలీ లెండి. అందుకే ఈ షో ని తీసుకొచ్చారు. ఇంకా షో ప్రతి ఆదివారం వచ్చేది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ఒక రకంగా చెప్పాలి అంటే ఇది లైవ్. కాల్ చేసిన కాలర్స్ ని ఒకా చీర చూపించి దాని రేట్ గెస్ చెయ్యమనేవారు. 

 

ఇంకా ఆ టైంలో ఆ పట్టుచీర కోసం ఆడవాళ్లు ఎలా పోటీ పాడుతారు అంటే అబ్బ ఒద్దులే. ఒకవేళ కూడా పట్టు చీర ధర కూడా ఒకటే చెప్పారు అంటే ఇంకా పట్టుచీర ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. ఎంతోమంది ప్రయత్నించేవారు. కానీ షో మొత్తానికి కూడా ఒకరో ఇద్దరో మాత్రమే చీర ధరను కరెక్ట్ గా చెప్పవాళ్లు. చీరను గెలుచుకునేవాళ్ళు. 

 

ఈ షో ని ఎంతోమంది హోస్ట్ చేసినప్పటికీ సుమక్క హోస్ట్ చేసినప్పుడు మాత్రమే దీనికి మంచి క్రేజ్ పెరిగింది. అలా ఉండేవి సుమ అక్క మాయ మాటలు. నిజంగా పట్టు చీరలు ఇచ్చేవారో లేదో తెలియదా కాదని లేడీస్ కి మాత్రం కావాల్సినంత షాపింగ్ అయ్యేది. ధర బాగుంటే షాపుల్లోకి వెళ్లి కొనేవారు. అంత బాగుండేది ఈ టీవీ షో. 

 

ఇలా జెమినీ టీవిలో అప్పట్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని వచ్చేవి. ఎన్నో ప్రోగ్రామ్స్ సూపర్ హిట్ అయ్యాయి. మరెన్నో ప్రోగ్రామ్స్ కామన్ గా నిలిచేవి కానీ మంచి గుర్తింపు తెచ్చుకునేవి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అద్భుతమైన షోస్ అంటే జెమినీ టీవీ షో లే. చాలా అద్భుతంగా అందంగా ఉండేవి ఈ టీవీ ప్రోగ్రామ్స్.                            

మరింత సమాచారం తెలుసుకోండి: