ఒరిజినల్ వస్తువుకు డూప్లికేట్ తయారు చేయాలంటే అది చైనా తరువాతే, గుండు సూది నుంచి ఐ ఫోన్ వరకు ప్రతీ ఒక్క వస్తువుకు చైనాలో డూప్లికేట్ దొరుకుతుంది. అసలు, నకిలీ వస్తువుకు మీరు తేడా కనిపెట్టలేరు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే అంతలా ఉంటుంది చైనా వారి పని తీరు. తాజాగా చైనా సూర్యుడికి డూప్లికేట్ ను తయారు చేస్తోంది. ప్రస్తుతం మొదటి దశలో ఉన్న ఈ ప్రయోగం 2025వ సంవత్సరం లోపు పూర్తి అవుతుంది అని చైనా చెబుతోంది.

 

గతంలో నకిలీ చంద్రుడిని తయారుచేసి సంచలనం సృష్టించిన చైనా ప్రస్తుతం నకిలీ సూర్యుడిని తయారు చేసే పనిలో ఉంది. హెచ్ఎల్-2ఎమ్ టోకమాక్ పేరుతో సూర్యుడికి ప్రతిసృష్టి చేస్తోంది చైనా. చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్ మరియు సౌత్ వెస్ట్రన్ ఫిజిక్స్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరుగుతోంది. సిచువాన్ ప్రావిన్స్ లోని లేషన్ అణు కర్మాగారంలో ఈ ప్రయోగం జరుగుతోంది.

 

ఈ నకిలీ సూర్యుడి ద్వారా 200 మిలియన్ డిగ్రీల (సెల్సియస్) ఉష్ణోగ్రతను సృష్టించవచ్చని చైనా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సూర్యుడి మీద 15 మిలియన్ డిగ్రీల (సెల్సియస్) ఉష్ణోగ్రత ఉంటుంది అంటే చైనా తయారు చేసే నకిలీ సూర్యుడు అసలు సూర్యుడు కంటే 13 రెట్ల అధిక ఉష్ణోగ్రతను వెలువరించనున్నాడు. నిజానికి ఈ నకిలీ సూర్యుడిని తయారు చేయాలన్న ఆలోచన చైనాకి 1986వ సంవత్సరంలోనే వచ్చింది కానీ అది కార్యరూపం దాల్చలేదు.

 

సూర్యుడిపై కేంద్రక సంలీన చర్యల ద్వారా అధిక ఉష్ణోగ్రత విడుదల అవుతుంది. ఈ కేంద్రక సంలీన చర్యలు నిరంతరం జరగడం ద్వారా శక్తి నశించదు. చైనా తన నకిలీ సూర్యుడిలో కేంద్రక విచ్చిత్తి చర్యల ద్వారా ఉష్ణోగ్రతను సృష్టించనుంది. నిజానికి ఈ ప్రయోగం చాలా ప్రమాదకరమైనది, ఈ ప్రయోగానికి చైనాతో పాటుగా 35 దేశాల భాగస్వామ్యం ఉంది. ఈ ప్రయోగానికి చైనా 22 బిలియన్ డాలర్ల సొమ్మును వెచ్చిస్తోంది. త్వరితగతిన నకిలీ సూర్యుడిని తయారుచేసి 2025వ సంవత్సరం కల్లా ఇద్దరు సూర్యుళ్లు ఉండేలా చేయాలనుకుంటోంది చైనా.

మరింత సమాచారం తెలుసుకోండి: