ఇటీవ‌ల కాలంలో ప్ర‌తి ఒక్క‌రి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. అది లేనిది ఎవరికీ రోజు గడవడం లేదు.  నేటి అవసరాలు, ఆధునిక టెక్నాలజీ కారణంగా స్మార్ట్ ఫోన్ ను పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఏది కావాల‌న్నా బ‌య‌ట‌కు వెళ్లే అవ‌స‌రం లేకుండా ఫోన్ ద్వారానే ఆ ప‌ని పూర్తిచేసుకుంటున్నాము. ఈ నేప‌థ్యంలోనే గూగుల్ పే, ఫోన్ పే ఇలా ర‌క‌ర‌కాలు యాప్స్ వాడుతుంటాము. అయితే గూగుల్‌పే వినియోగదారులకు కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. 

 

అదేంటంటే.. వాహనదారులు ఇకపై తమ ఫాస్టాగ్‌ సులువుగా రీఛార్జ్‌ చేసుకునేలా యూపీఐ సౌకర్యాన్ని యాప్‌ ద్వారా స్టాట్ చేసింది. దీని కోసం గూగుల్‌పేకు ఫాస్టాగ్‌ ఖాతాను లింక్‌ చేసుకుని రీఛార్జ్‌ చేసుకోవడమే కాకుండా, పేమెంట్స్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేసుకునే సదుపాయాన్ని సైతం కల్పిస్తుంది.  అయితే గూగుల్‌పే ద్వారా ఫాస్టాగ్‌ రీఛార్జ్ ఎలా చేసుకోవాలి అనేదేగా మీ డౌట్‌. అది కూడా మ‌రి చూసేయండి. గూగుల్‌పే ద్వారా ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ చేసుకోవాలనుకునే వినియోగదారులు యాప్‌లోని బిల్‌ పేమెంట్స్‌ సెక్షన్‌ కింద ఉండే ఫాస్టాగ్‌ కేటగిరీని ఎంపిక చేసుకోవాలి. 

 

ఆ తర్వాత మనకు ఫాస్టాగ్‌ జారీ చేసిన బ్యాంకును సెలెక్ట్‌ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చేయాల్సిందేంటంటే.. మీ వాహ‌నం నంబర్‌ ఎంటర్‌ చేసి బ్యాంకు ద్వారా పేమెంట్‌ పూర్తి చేయ‌డ‌మే. ఇక్క‌డ మ‌రో విషయం ఏంటంటే.. అలాగే ఫాస్టాగ్‌ బ్యాలెన్స్‌ ఎంత ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అప్లికేషన్‌ వీలు కూడా కల్పిస్తుంది. ఇంకెందుకు ఆల‌స్యం.. ఈ సౌక‌ర్యాన్ని మీరు వినియోగించుకోండి మ‌రి..!


 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: