సాంకేతికత పెరిగిన నేటి ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్‌ లేనిదే చాలామందికి రోజులు గడవని పరిస్థితి నెలకొంది.  చివరకు అడుక్కుతినే వాడైనా సరే.. ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ సాధారణమైపోయింది.  సమాచారమైనా, చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, ఏ పనైనా కావచ్చు. ఫోను లేకుండా రోజు గడవడం కష్టమే. కాలాగుణంగా మారిన మార్పులతోపాటు, అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్‌ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే స్మార్ట్‌ఫోన్‌లను మరింత క్రియేటివ్‌గా వాడుకోవాలని చాలా మంది యూజర్లు తాపత్రయపడుతుంటారు.

 

ఈ నేప‌థ్యంలోనే కాల్ వ‌చ్చిన‌ప్పుడు ఫ్లాష్ లైట్ వెలిగితే ఎలా ఉంటుంది. భ‌లే బాగుంటుంది క‌దా. అయితే కాల్ రిసీవ్ చేసుకున్న ప్రతిసారి ఫోన్ కెమెరా ఫ్లాష్‌‌లైట్ వెలిగేలా చేసుకునేందుకు ఓ ప్రత్యేకమైన ట్రిక్ ఉంది. ఈ ట్రిక్ ఫాలో అయితే ఫోన్ సైలంట్‌లో ఉన్నప్పటికి కాల్‌ను సునాయాశంగా గుర్తించవచ్చు. అందుకోసం ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫాష్ అల‌ర్ట్ 2 యాప్‌ను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఫోన్‌కు సంబంధించిన ఫ్లాష్‌లైట్, ఇన్‌కమ్మింగ్ కాల్స్ అలానే నోటిఫికేషన్స్‌ను యాక్సెస్ చేసుకునేందుకు యాప్‌కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.

 

ఇప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసి హోమ్ పేజీలోని ఆన్‌స్ర్కీన్ నోటిఫికేషన్స్ ఫాలో అవ్వటం ద్వారా ఓ టెస్ట్‌ను పూర్తి చేయవచ్చు. తదుపరి చర్యలో భాగంగా యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఇన్‌క‌మ్మింగ్ కాల్‌ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. సెట్టింగ్‌ను అప్‌డేట్ చేసిన తరువాత ఫోన్‌ను రీబూట్ చేయవల్సి ఉంటుంది. రీబూట్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత యాప్‌ను ఓపెన్ చేసి మరోసారి ఇన్‌క‌మ్మింగ్‌ ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయినట్లయితే, ఆ తరువాత నుంచి మీరు రిసీవ్ చేసుకునే ప్రతి‌కాల్‌కు ఫ్లాష్ లైట్ వెలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: