టెక్నాల‌జీ పెరుగుతున్న కొద్దీ వేర‌బుల్ గ్యాడ్జెట్ల‌కు క్రేజ్ పెరుగుతోంది. స్మార్ట్ వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాక‌ర్లు, డిజిట‌ల్ రింగ్స్ వంటివి ఈ కోవ‌లోకే వ‌స్తాయి. అయితే ముఖ్యంగా ప్రపంచంమెచ్చిన అత్యుత్తమ స్మార్ట్‌వాచీలలో యాపిల్ స్మార్ట్‌వాచ్ ఒకటి. ఈ వాచీకి సంబంధించి ఇప్పటికే అనేక యాప్స్ మార్కెట్లో కొలువుతీరి ఉన్నాయి. యాపిల్ వాచ్ టెక్నాల‌జీప‌రంగా సూట‌బుల్ మాత్ర‌మే కాదు స్టైలిష్‌గా, లావిష్‌గా కూడా ఉంటుంది. ప్ర‌స్తుతం వాచీల విక్రయాల్లో యాపిల్ అదుర్స్ అనిపించుకుంటుంది. యాపిల్ వాచ్​ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. 

 

అయితే యాపిల్ ప్రియుల‌కు ఓ బిగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన యాపిల్ వాచ్ మోడ‌ల్స్ చ‌తుర‌స్రాకారంలో వ‌స్తున్నాయి. ఈ విష‌యం తెలిసిందే అనుకోండి. కానీ, ఇక‌పై ఈ త‌ర‌హా డిజైన్‌కు యాపిల్ ముగింపు ప‌లుకుతున్న‌ట్లు తెలుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం త్వ‌ర‌లో రానున్న యాపిల్ వాచ్ 6 చ‌తుర‌స్రాకారంలో కాక వృత్తాకారంలో ఉంటుంద‌ని స‌మాచారం. యాపిల్ వాచ్ సిరీస్ 6 స్మార్ట్‌వాచ్‌ల‌ను యాపిల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేయ‌నున్న నేప‌థ్యంలో ఇప్పటికే ఆ వాచ్‌కు చెందిన ప‌లు ఇమేజ్‌లు, స్పెసిఫికేష‌న్లు నెట్‌లో లీక‌య్యాయి. 

 

ఆపిల్ వాచ్ 6 ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యాన్ని గ్ర‌హించి దాన్ని ఊహించి కొంద‌రు ముందుగానే ఇమాజినేటివ్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. దీనిని బ‌ట్టీ చూస్తే.. యాపిల్ వాచ్ 6 వృత్తాకార డిస్‌ప్లేను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిసింది. అలాగే డిస్‌ప్లే కింది భాగంలో ఫ్లెక్సిబుల్ స‌ర్క్యూట్ బోర్డుల‌ను అమ‌రుస్తున్న‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా, డిస్‌ప్లే సైజ్‌ను కూడా కొద్దిగా పెంచుతున్న‌ట్లు తెలుస్తోంది. వాచ్ 6లో మైక్రో ఎల్ఈడీ ప్యానెల్‌ను ఆపిల్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక గ‌తంలో వ‌చ్చిన వాచ్‌ల క‌న్నా వాచ్ 6 మ‌రింత ఎక్కువ వాట‌ర్ ప్రూఫ్ ప్రొటెక్ష‌న్‌ను క‌లిగి ఉన్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: