స్మార్ట్‌ఫోన్ ప్రియుల‌కు గుడ్ న్యూస్‌. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ ఎదుర్కొంటున్న సాంసంగ్... సరికొత్త స్మార్ట్‌ఫోన్లను ఇండియాలో రిలీజ్ చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం30 అప్‌గ్రేడ్ వర్షన్ సాంసంగ్ గెలాక్సీ ఎం31 రిలీజ్ చేసింది. వాస్త‌వానికి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రూ.15,000లోపు విభాగంలో పోటీ రసవత్తరంగా కొనసాగుతోంది. దీన్ని గమనించిన శాంసంగ్ కంపెనీ.. అందుబాటు ధరతో గెలాక్సీ ఎం సిరీస్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ ఈ ఫోన్ల ద్వారా బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ విభాగంలో నూతన ఒరవడిని సృష్టించంది. అయితే ఇప్పుడు మ‌రో సారి అదే బాట ప‌ట్టింది.

 

సాంసంగ్ గెలాక్సీ ఎం31లో.. 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. టైప్ సీ పోర్ట్‌థో పాటు 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సాంసంగ్ గెలాక్సీ ఎం31 స్మార్ట్‌ఫోన్ రూ.15,000 లోపు బడ్జెట్‌లో రావడం విశేషం. మార్చి 5 మధ్యాహ్నం 12 గంటలకు సాంసంగ్ గెలాక్సీ ఎం31 సేల్ అమెజాన్‌లో ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే ఇదే బడ్జెట్‌లోపు ఉన్న షావోమీ, రియల్‌మీ, వివో, ఒప్పో లాంటి కంపెనీల స్మార్ట్‌ఫోన్లకు సాంసంగ్ గెలాక్సీ ఎం31 గట్టి పోటీ ఇవ్వనుంది. 

 

ఇక స్పెసిఫికేష‌న్స్ విష‌యానికి వ‌స్తే సాంసంగ్ గెలాక్సీ ఎం31.. 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ యూ డిస్‌ప్లే, 6జీబీ ర్యామ్‌,  64జీబీ, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. అలాగే 64+8+5+5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమ‌ర్చారు. ఎక్సినోస్ 9611 ప్రాసెసర్,  6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, సాంసంగ్ వన్ యూఐ 2.0 + ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయెల్ సిమ్  సపోర్ట్ ఇందులో ఉన్నాయి. ఇక ధ‌ర విష‌యానికి వ‌స్తే.. 6జీబీ+64జీబీ ధ‌ర రూ.14,999 కాగా, 6జీబీ+128జీబీ ధ‌ర రూ.15,999 నిర్ణ‌యించారు. స్పేస్ బ్లాక్, ఓషియన్ బ్లూ క‌ల‌ర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: