రియల్‌మీ ప్రియుల‌కు గుడ్ న్యూస్‌. రెడ్‌మీకి పోటీగా అమ్మకాల్లో దూసుకెళుతున్న చైనాకు చెందిన మరో స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ రియల్‌మీ. చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ రియల్‌మీ మరో కొత్త బడ్జెట్‌ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. మార్చి 5న రియల్‌మీ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం రియల్‌మీ 5 సిరీస్‌లో రియల్‌మీ 5, రియల్‌మీ 5ఎస్, రియల్‌మీ 5 ప్రో మోడల్స్ మార్కెట్‌లో ఉన్నాయి.

 

వీటి అప్‌గ్రేడ్ వర్షన్‌తో రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో మోడల్స్ వచ్చే నెలలో మార్కెట్లోకి రాబోతున్నాయి. రియల్‌మీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రచారం చేస్తున్నారు. స్పెషాలిటీస్ విష‌యానికి వ‌స్తే..  రియల్‌మీ 6 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లలో హోల్-పంచ్ డిస్‌ప్లే కనిపించడం విశేషం. డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం మరో ప్రత్యేకత. రియల్‌మీ 6 సిరీస్ ఫోన్లన్నింటికీ డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశముంది.మ‌రియు 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని రియల్‌మీ వెల్లడించింది.  

 

అంతేకాకుండా, రియల్‌మీ 6 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్, 4,300 బ్యాటరీ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. రియల్‌మీ 6 ప్రో మోడల్‌లో క్వాడ్ కెమెరా సెటర్, 20x జూమ్, 90Hz రిఫ్రెష్ రేట్ లాంటి ప్రత్యేకతలు ఉండే అవకాశముంది. మరి ఈ రెండు ఫోన్లల్లో ఎలాంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయో తెలియాలంటే మార్చి 5 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే.. మార్చి 5న మధ్యాహ్నం 12.30 గంటలకు రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు పరిచయం కానున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: