వాట్సాప్‌.. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్ర‌తిఒక్క‌రికీ ప‌రిచ‌డం అవ‌స‌రం లేని పేరు. అస‌లు స్మార్ట్‌ఫోన్‌ కొనే చాలామంది మొదట ఇన్‌స్టాల్‌ చేసే యాప్‌ వాట్సప్‌ అంటే అతిశయోక్తి కాదు. ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్రపంచంలోకి పెను ఉప్పెనలా దూసుకొచ్చిన వాట్సాప్‌ను రకరకాల కమ్యూనికేషన్ అవసరాల దృష్ట్యా ప్రతిరోజు కోట్ల‌లో యూజర్లు ఉప‌యోగిస్తున్నారు. ఇక  ఇటీవ‌ల వాట్సాప్ స్లో అయితే ఎంత గంద‌ర‌గోళం అయిందో చెప్ప‌క్క‌ర్లేదు. ఎందుకంటే.. అంత‌లా వాట్సాప్ క్రేజ్ సంపాధించుకుంది కాబ‌ట్టి.

 

క్లారిటీ చెప్పాలంటే వాట్సాప్ మన జీవితంలో నిత్యావసరం. బిజినెస్ డీల్స్, ఆఫీస్ వర్క్ అన్నీ వాట్సాప్ ద్వారా సులువుగా అవుతున్నాయి. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే..  మీరు పంపే మెసేజ్ లను, అవతలి వారు చదివారో లేదో తెలుసుకోడానికి వాట్సాప్ లో బ్లూ టిక్స్ బటన్ ఎలాగో అందుబాటులో ఉంది. అయితే ఫ్రైవసీ ఫీచర్స్‌లో భాగంగా ఎదుటి వ్యక్తి బ్లూటిక్స్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసి ఉంటేమాత్రం వాళ్లు మన మెసేజ్‌ చదివారో లేదో తెలుసుకోవటం కష్టం. కానీ.. అవ‌త‌ల వారు  బ్లూటిక్స్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసి ఉన్నా కూడా ఓ చిన్ని ట్రిక్ ఉప‌యోగించి మ‌న మెసేజ్ చ‌దివారో లేదో తెలుసుకోవ‌చ్చు.

 

అందుకు ముందుగా వాట్సాప్ యాప్ లో చాట్‌బాక్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరి చాట్ ను పరిశీలించాలనుకుంటున్నారో ఆ చాట్ ను ఓపెన్ చేయండి. అందులో వారు చదవని మీ మెసేజ్ ను ఎంచుకుని దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే సెలక్ట్ చేయండి. అప్పుడు కుడివైపు పైభాగంలో మీకు కనిపించే మూడు చుక్కల ఐకాన్ పై క్లిక్ చేయండి. అంతే ఆ వ్యక్తికి మీ మెసేజ్ ఎప్పుడు రీచ్ అయిందో, దాన్ని వారు ఎప్పుడు చదివారో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే..  ఈ ట్రిక్ ను వాట్సాప్ గ్రూప్ లో కూడా ఉపయోగించవచ్చు. దీని ద్వారా మీ మెసేజ్ ని గ్రూప్ లో ఎంతమంది చదివారో కూడా తెలిసిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: