ప్రపంచాన్ని క‌కావిక‌లం చేస్తున్న క‌రోనా వైర‌స్‌ను అంతం చేయ‌డానికి మందును క‌నుగోనేందుకు శాస్త్ర‌వేత్త‌లు నిర్విరామంగా శ్ర‌మిస్తున్నారు. అయితే క‌రోనా వైర‌స్ దేనికి ఏ మందుకు లొంగ‌క‌పోవ‌డంతో ఓ కొత్త‌వాద‌న తెర‌మీద‌కు వ‌స్తోంది. క‌రోనా వైర‌స్‌ను గ్ర‌హంత‌ర‌వాసులే భూమీద‌కు పంపి ఉంటార‌నేదే ఆ అంశం. కరోనా వైరస్ ఒక తోకచుక్క ద్వారా భూమ్మీదకు వచ్చిందని అక్టోబర్ 2019లో చైనాలో భూభాగం పైకి అంతరిక్ష శిల వచ్చి ఉండవచ్చని కొంత‌మంది శాస్త్ర‌వేత్త‌లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.  వైరస్ లను మోసుకొచ్చే తోకచుక్కలు గతంలో కూడా వ‌చ్చాయ‌ని వారు కొన్ని వార్త‌ల‌ను ఆధారంగా చూపుతున్నారు. 


 గతంలో, విక్రమసింఘే అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS) కూడా అంతరిక్షం నుంచి  వచ్చిందని నొక్కి చెప్పిన విష‌యం తెలిసిందే.  1970లోనే ఫ్రెడ్ హోయల్‌తో కలిసి "డిసీజెస్ ఫ్రమ్ స్పేస్ష వ‌చ్చిన పుస్త‌కానికి ఆయ‌న స‌హ ర‌చ‌యిత‌గా కూడా ఉన్నారు. దశాబ్దాలుగా, SARS లాంటి వ్యాధులు అంతరిక్షం నుంచి వచ్చాయని నిరూపించడానికి ప‌రిశోధ‌న‌లు చేస్తూనే ఉన్నారు. అయితే ఒక వైరస్ అంతరిక్షం నుంచి ప్ర‌యాణించి రేడియేషన్ తట్టుకొని భూమిపై మానవులకు సోకగలదా..? అని కొంత‌మంది శాస్త్ర‌వేత్త‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. 

 

అయితే నాసాకు చెందిన ప్రముఖ ఆస్ట్రోబయాలజిస్ట్ గ్రాహం లా మాత్రం విక్రమ సింఘే వాదనలను కాద‌న‌లేమ‌ని చెబుతున్నారు. అలా అని విక్రమసింఘే వాదనలను తాను బ‌లప‌ర్చ‌డం లేద‌ని, మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి త‌న‌కు ఆధారాలేమీ క‌నిపించ‌డం లేద‌ని చెప్పారు. ఈ స‌మ‌యంలో విక్రమసింఘే వాదనకు పాన్స్పెర్మియా సిద్ధాంతం బలం చేకూరుస్తోందంట‌. ఈ సిద్ధాంతం ఏం చెబుతోందంటే   బాహ్య అంతరిక్షం నుంచి వచ్చిన జీవసంబంధమైన పదార్థాల సహాయంతో భూమిపై  జీవం ఉద్భవించిందని పాన్స్‌పెర్మియా  సిద్ధాంతం వివ‌రిస్తుంది. అయితే క‌రోనాను కూడా ఆ కోణంలో కూడా ప‌రిశీలించాల‌ని విక్ర‌మ‌సింఘే చెబుతున్నారు. అయితే కొత్త కరోనావైరస్ బాహ్య అంతరిక్షం నుంచి వచ్చినట్లుగా అయితే మ‌న ద‌గ్గ‌ర ఎలాంటి ఆధారాలు లేవు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: