వాట్సాప్.. నేటి త‌రానికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగేకొద్ది.. సోషల్ మీడియా దిగ్గజం పేస్ బుక్ కు చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగం కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా రకరకాల కమ్యూనికేషన్ అవసరాల దృష్ట్యా ప్రతిరోజు కోట్ల‌లో యూజర్లు వాట్సాప్‌ను వినియోగించుకుంటున్నారు. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ద్వారా చాలా సులువైంది. దీంతో అంద‌రూ వాట్సాప్‌కే మొగ్గు చూపుతున్నారు. 

 

 మ‌రోవైపు వాట్సాప్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకువ‌స్తూ యూజ‌ర్ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఇక తాజాగా వాట్పాప్ మ‌రో సరికొత్త ఫీచర్‌తో ముందుకు రానుంది. ఇప్ప‌టికే ప‌లు అద్భుత ఫీచ‌ర్ల‌ను తీసుకువ‌చ్చి యూజర్ ఫ్రెండ్లీగా మారిన వాట్సాప్‌..  చాట్ విండోస్‌లో సరికొత్త సెర్చ్ ఆప్షన్ తీసుకురాబోతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. వాట్సాప్ త‌మ యూజ‌ర్ల కోసం అతి త్వర‌లోనే నిర్ధిష్ట తేదీ ఆధారంగా శోధించే సెర్చ్ బై డేట్‌(Search By Date) ఆప్షన్‌ను పరిచయం చేయబోతోంది. ఈ ఆపక్షన్ అందుబాటులోకి వస్తే..  నిత్యం వాట్సప్‌ యాప్, వాట్సప్ వెబ్‌‌పై పనిచేసే ఉద్యోగులకు డేటా సర్చింగ్ సులభతరం అవుతుంది.

 

వాస్త‌వానికి ఇప్ప‌టికే వాట్సాప్‌లో సెర్చ్ ఆపక్షన్ ఉంది. కానీ, అది చాట్ హిస్టరీ మొత్తాన్ని సెర్చ్ చేస్తుంది. దీనికి చాలా టైమ్‌ పడుతుంది. ఈ క్ర‌మంలోనే మ‌న టైమ్ కూడా వృధా అవుతుంది. అంతేకాదు మనం వెతికిన పదంతో ఉన్న సందేశాలన్నీ వచ్చి తర్వాత.. మాన్యువల్‌గా స్క్రోల్ చేస్తూ మనకు కావాల్సిన సందేశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. కానీ,  సెర్చ్ బై డేట్ ఫీచ‌ర్ వస్తే.. మనకు కావలసిన రోజుకు వెళ్లి.. మనకు అవసరం ఉన్న సందేశాన్ని తిరిగి పొందవచ్చు. ఇది వాట్సాప్ యూజ‌ర్ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్  ప్రారంభ దశలోనే ఉందని. అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పట్టవచ్చని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: