కొన్ని ఫోన్లు కొన్ని అద్భుతాలను సృష్టిస్తాయి. కొన్ని ఫోన్లు కెమెరాలో సూపర్ ఉంటే.. మరికొన్ని ఫోన్లు బ్యాటరీలో బాగుంటాయి.. మరికొన్ని ఫోన్లు అయితే ధరలో అద్భుతంగా ఉంటాయి. ఇంకా ఇప్పుడు బ్యాటరీ, ధర రెండు అద్భుతంగా ఉన్నాయ్. అదే టెక్నో స్పార్క్ పవర్ 2 స్మార్ట్ ఫోన్. గత సంవత్సరమే ఈ స్మార్ట్ ఫోన్ కు ముందు వర్షన్ విడుదల అయ్యింది. ఇంకా ఆ స్మార్ట్ ఫోన్ కు కొత్త ఫోన్ ఏ ఈ టెక్నో స్పార్క్ పవర్ 2 స్మార్ట్ ఫోన్. 

 

స్మార్ట్ ఫోన్ ఈ నెల 17వ తేదీన కంపెనీ లాంచ్ చేయనుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.9,999గా నిర్ణయించారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కేవలం ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎంత అనుకుంటున్నారు? 4000 ఎంఏహెచ్ కాదు 5000 ఎంఏహెచ్ కాదు ఏకంగా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ స్మార్ట్ ఫోన్. 

 

స్మార్ట్ ఫోన్ కి ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏకంగా నాలుగు రోజుల పాటు దీని చార్జింగ్ ఉంటుంది. అంతేకాదు 10 నిమిషాలు చార్జ్ పెడితే మూడు గంటల పాటు ఉపయోగించుకునేలా ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ను కూడా అందించారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్, బ్లూ రంగుల్లో అందుబాటులో ఉండనుంది. 

 

వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లేను ఇందులో అందించారు. ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్, వెనకవైపు నాలుగు కెమెరాలు కూడా ఇందులో అందించారు. ఇందులో 6.6 అంగుళాల డిస్ ప్లేను అందించారు. ఐస్ జేడైట్, స్పార్క్ ఆరెంజ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: