రియల్ మీ.. అతి తక్కువ ధరకే అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను అందిస్తున్న బ్రాండ్ ఈ రియల్ మీ. ఇంకా అలాంటి ఈ రియల్ మీ నుండి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది. అదే రియల్ మీ ఎక్స్3. ఈ రియల్ మీ ఎక్స్ 3 స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ కానున్నట్టు తెలిపారు. 

 

అయితే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధిన లాంచ్ డేట్ క్లియర్ గా తెలియలేదు కానీ.. రియల్ మీ ఎక్స్ 3 స్మార్ట్ ఫోన్ సూపర్ జూమ్ తో పాటు లాంచ్ కానున్నట్టు సమాచారం. అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్లు దాదాపు ఒకేలా ఉన్నాయ్ అని కెమెరా విషయంలో మాత్రమే తేడాలు ఉండనున్నాయి అని తెలుసుతుంది. ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మనదేశంలోని బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ వెబ్ సైట్ లో కనిపించాయి. 

 

రియల్ మీ ఎక్స్3 ఫీచర్లు ఇలా ఉన్నాయి... 

 

2400 x 1080 పిక్సెల్స్ కెమెరా, 

 

ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే,

 

8 జీబీ ర్యామ్ ఇందులో అందించనున్నారు. 

 

రియల్ ఎక్స్3 సూపర్ జూమ్ ఫీచర్లు.. 

 

6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఎల్సీడీ డిస్ ప్లే,

 

4200 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 

 

30W ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేయనుంది. 

 

వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. 

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ + దీంతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ + 8 మెగా పిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ను ఇందులో అందించారు. 

 

32 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ రెండు సెన్సార్లను సెల్ఫీ కెమెరాకు అందించారు.

 

అయితే అన్ని తెలిశాయి కానీ ఇంకా ధర మాత్రం లీక్ అవ్వలేదు. మరి ఈ స్మార్ట్ ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: