నేటి కాలంలో ప్ర‌తి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ ను వినియోగిస్తున్నారు. సమాజంలో యువత కానీ పెద్దవారు కానీ ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడనిది ఏదైనా ఉంది అంటే అది స్మార్ట్‌ఫోన్‌ మాత్రమే. ఎక్కవ బడ్జెట్ ఫోన్‌లు మొదలకుని తక్కువ బడ్జెట్ ఫోన్‌ల మార్కెట్లో వందలాది మోడళ్లలో లభ్యమవుతున్నాయి. అయితే స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న ప్ర‌తి ఒక్క‌రూ ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య ఫోన్ హ్యాంగ్ అవ్వ‌డం. భారీ బ‌డ్జెట్‌లో కొన్నా ఫోన్ అయినా.. లో బ‌డ్జెట్‌లో కొన్నా ఫోన్ అయినా.. కొన్ని సార్లు హ్యాంగ్‌ అవుతుంది. మళ్ళీ ఫోన్‌ రీస్టార్ట్‌ చేస్తేనే పని చేస్తుంది. సాధారణంగా సెల్‌ఫోన్‌కి వైరస్‌ రావడం వల్ల ఫోన్‌ తరచూ హ్యాంగ్‌ అవుతూ ఉంటుంది. 

 

కానీ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే తమ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాంగ్‌ నుంచి తప్పించుకోవచ్చు. సాధార‌ణంగా చాలా మంది ప‌నికిరాని అనేక రకాల యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తుంటారు. ఈ యాప్‌లు డివైస్‌లో ఎక్కువ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించేసి ఫోన్ వేగాన్ని పూర్తిగా తగ్గించి వేస్తాయి. ఫోన్‌లు హ్యాంగ్ అవటానికి కూడా ప్రధాన కారణం ఇవే. కాబట్టి మీ ఫోన్‌ను ఎప్పటికప్పుడు వేస్ట్ యాప్స్‌ను తీసివేయండి. అలాగే మార్కెట్‌లో ఎక్కువ జీబీతో అనేక రకాల ఎస్డీ కార్డులు అందుబాటులో ఉంటున్నాయి. కానీ వాటికి కాస్త దూరంగా ఉండడమే ఉత్తమం.

 

ఎందుకంటే మెమోరీ కార్డుతో ఎక్కువ స్పేస్‌ లభించినా వీటి వల్ల వైరస్‌ సోకి, ఫోన్ హ్యాంగ్‌ అయ్యే ప్రమాదం ఉంది. ఫోన్‌ వేగం కూడా తగ్గుతుంది. సో.. వీటికి దూరంగా ఉండ‌డ‌మే మేలు. అదేవిధంగా, మీ ఫోన్.. అప్లికేషన్‌లు అలానే మీడియా ఫైళ్లతో నిండి ఉన్నట్లయితే డివైస్ ఆన్ బోర్డ్ మెమరీ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇలాంట‌ప్పుడు ఫోన్ హ్యాంగ్ అయ్యేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటుయి. సో.. ఫోన్‌లో పేరుకుపోయిన అనవసర ఫైళ్లను వెంట‌నే తీసిపారేయండి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: