మీరు ట్విట్టర్ అకౌంట్ వాడుతున్నారా? అయితే వెంటనే మీ అకౌంట్ సేఫ్‌గా ఉందో లేదో ఛెక్ చేసుకోండి. మొత్తం 37.9 కోట్ల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకర్ల బారిన పడినట్లు తాజాగా వెల్లడైంది. ఆయా అకౌంట్ల యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు, మెయిల్ ఐడిలు అన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టబడ్డాయి.  మేలో భారీ మొత్తంలో Linkedin, Myspace అకౌంట్లు హ్యాక్ అయిన విషయం తెలిసిందే. ఆ అకౌంట్లు హ్యాక్ అవడానికి కారణం అయిన వ్యక్తులే ఇప్పుడు కోట్ల కొద్దీ ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ అవడానికి కారణమయినట్లు తెలుస్తోంది.

Tessa88 అనే పేరు గల రష్యన్ హ్యాకర్ తన వద్ద 37.9 కోట్ల ట్విట్టర్ అకౌంట్ల యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు, ఆయా అకౌంట్లకి సంబంధించిన మెయిల్ ఐడిలు ఉన్నాయని ప్రకటించాడు. భారీ మొత్తంలో ఉన్న ఈ అకౌంట్ల డేటాబేస్‌ని 10 బిట్‌కాయిన్లకి అమ్మకానికి పెట్టాడు. అంటే భారతీయ కరెన్సీలో రూ. 3,86,745 మొత్తానికి ఈ డేటాబేస్ అమ్మబడుతోందన్నమాట. అయితే వివిధ ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల అకౌంట్లు లీక్ అయినప్పుడు ఆ వివరాలను అధికారికంగా సేకరించి ప్రకటించే LeakedSource అనే వెబ్‌సైట్ భారీ మొత్తంలో ట్విట్టర్ అకౌంట్లు లీక్ అయినట్లు నిర్థారణ చేసింది గానీ అవి కేవలం 33 మిలియన్లు మాత్రమే అని తేల్చి చెప్పింది.

ఇటీవల సంచలనం సృష్టించిన ఫేస్‌బుక్ సిఇఓ మార్క్ జుకెర్‌బెర్గ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ ఉదంతం తర్వాత ఈ భారీ అకౌంట్ లీక్ ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ యూజర్లని భయభ్రాంతులకు గురిచేస్తోంది. మీరూ ట్విట్టర్ తరచూ వాడుతుంటే మీ అకౌంట్ పాస్‌‌వర్డ్‌ని వెంటనే మార్చుకోండి. పై చిత్రంలో కాంప్రమైజ్ అయిన పలు ట్విట్టర్ అకౌంట్ల పాస్‌వర్డ్‌లు చూడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: