ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ బ్రాండ్ కి ఉన్న పేరు అందరికీ తెలిసిందే. అందులో ఐఫోన్ మార్కెట్ లోకి రావడం తో ఈ ఫోన్ సంస్థ కి తిరుగు లేకుండా పోయింది. ప్రపంచం లో ఎవరిని కదిపినా ఈ ఫోన్ కొనడమే తమ అల్టిమేట్ లక్ష్యం అంటూ చెప్పుకొస్తారు . తక్కువ టైం లో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు అందరినీ అలరిస్తోంది. ప్రస్తుతం ఐఫోన్ 7 మార్కెట్ లో ఉండగా కొత్తగా ఆపిల్ 8 స్మార్ట్ ఫోన్ ఫీచర్ లు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ ప్రత్యేకత 5.8 అంగుళాల ఓలెడ్ (ఓఎల్‌ఈడీ) డిస్‌ ప్లే... దీనిని ‘ఐఫోన్ ఎక్స్’గా పిలవనున్నట్టు తెలుస్తోంది. అప్‌ డేటెడ్ వెర్షన్ అయిన ఇది ఐఫోన్ 7 ప్లస్ కంటే చిన్నగా ఉండనున్నట్టు తెలుస్తోంది. దీని డిస్ ప్లే 5.8 అంగుళాలుగా చెబుతున్నప్పటికీ... దీని డిస్ ప్లే కేవలం 5.15 అంగుళాలు మాత్రమే ఉండనుంది. మిగిలిన 0.65 అంగుళం ఫంక్షనింగ్ ఏరియాగా ఉంటుంది. ఇది వైర్ లెస్ ఛార్జింగ్ సౌకర్యంతో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దీని ధర సుమారు వెయ్యి డాలర్లుగా నిర్ణయించినట్టు లీకైన వార్తలు చెబుతున్నాయి. దీనిని బట్టి ఇప్పటివరకు ఇదే అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ అని తెలుస్తోంది. దీనితోపాటు ఐఫోన్, ఐపాడ్ తదితర యాపిల్ ఉత్పత్తుల కోసం ‘అల్ట్రా యాక్సెసరీ కనెక్టర్ (యూఏసీ) అనే కొత్త రకం కనెక్టర్‌ ను విడుదల చేసేందుకు యాపిల్ సిద్ధమవుతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: