కొత్తకారు కొంటున్నారా....? అయితే అది కంపల్సరీ... ఇంతకీ ఎంటది అంటారా... అదేనండి ఫాస్ట్ ట్యాగ్ డివైజ్... డిసెంబర్ 1నుంచి అమ్మే ప్రతికారులో ఫ్రండ్ విండ్ స్క్రీన్ పై దీన్నిఅమర్చాలని కేంద్ర ప్రభుత్వం కార్ల తయారీ సంస్థలను ఆదేశించింది. డీలర్స్ అయినా వీటిని అమర్చొచ్చు....ప్రస్తుతం టోల్ గేట్ల దగ్గర ఫుల్  ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనం ఆగడం డబ్బులు తీసివ్వడం... చిల్లర తీసుకోవడం.... దీంతో వెనకున్న వాహనాలు ఆగిపోవాల్సిన పరిస్థితి. భారీగా ఇంధనం కూడా వృధా అవుతోంది.


పండగల సందర్భాల్లో అయితే టోల్ గేట్ల దగ్గర గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంటోంది. దీనికి పరిష్కారంగా కేంద్రం ఈ మార్గం ఎంచుకుంది. దీనికి సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ కూడా జారీచేసింది.కారు టోల్ గేట్ దగ్గరకు చేరగానే అక్కడ ఉన్న మెషిన్ కారు విండ్ స్క్రీన్ ను స్కాన్ చేసేస్తుంది. వెంటనే దాన్లో ముందుగానే రీఛార్జ్ చేసిన మొత్తం నుంచి కానీ లేదా కస్టమర్ బ్యాంక్ ఎకౌంట్ నుంచి గానీ నిర్ణీత మొత్తం టోల్ కంపెనీ ఎకౌంట్ లోకి వెళ్లిపోతుంది.


ఇందుకు కేవలం కొన్ని సెకన్లు మాత్రమే పడుతుంది. దీంతో వాహనాలు టోల్ గేట్ దగ్గర ఆగాల్సిన పరిస్థితి కూడా ఉండదు. స్లో అవగానే పనైపోతుంది. ఒకవేళ కారుకు దాన్ని అమర్చకపోతే రిజిస్ట్రేషన్ సమయంలోనైనా దాన్ని ఫిట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 370 టోల్ ప్లాజాల్లో ఫాస్ట్ ట్యాగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు.


కొంతమంది వాహనాదారులు ఈ విధానం ద్వారానే టోల్ రుసుం చెల్లిస్తున్నారు. త్వరలో మిగిలిన టోల్ గేట్లలోనూ దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ఫలితంగా టోల్ గేట్ల దగ్గర నిర్వహణ వ్యయం తగ్గడం, సమయం ఆదా ఆవడంతో పాటు భారీగా ఇంధనం ఆదా అవుతుందని కేంద్రం భావిస్తోంది. సో కొత్తకార్లకు ఈ ఫాస్ట్ ట్యాగ్ కంపల్సరీ.. త్వరలో పాతకార్లకు కూడా దీన్ని కంపల్సరీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: