టెక్ దిగ్గజం గూగుల్ తన పిక్సల్ సిరీస్‌లో భాగంగా మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేయనుంది. ఈ ఫోన్లను త్వరలో మార్కెట్‌లోకి అందుబాటులో రానుంది.  భారత మార్కెట్లో తొలిసారి ప్రవేశపెట్టినప్పుడు వీటి ప్రారంభ ధరలు రూ.61వేలు, రూ.73వేలుగా ఉండేవి. అయితే గత డిసెంబర్ నెలలో ఈ ఫోన్ల ధరలను గూగుల్ మొదటిసారి కాస్త తగ్గించింది. 
Image result for google pixel 2
తాజాగా ఈ ఫోన్లపై రూ.11000, రూ.8000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీనికి తోడు సిటీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్లను కొంటే అదనంగా మరో రూ.8వేలు, రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ కూడా లభిస్తుంది. ఈ నెల 28వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ఫోన్లను కొనుగోలు చేసిన 90 రోజులకు క్యాష్ బ్యాక్ వస్తుంది.


డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ కలుపుకుని గూగుల్ పిక్సల్ 2 ఫోన్ల ధర :
గూగుల్ పిక్సల్ 2 (64 జీబీ) - రూ.41,999
గూగుల్ పిక్సల్ 2 (128 జీబీ) - రూ.50,999
గూగుల్ పిక్సల్ 2 ఎక్స్‌ ఎల్ (64 జీబీ) - రూ.54,999
గూగుల్ పిక్సల్ 2 ఎక్స్‌ ఎల్ (128 జీబీ) - రూ.63,999


మరింత సమాచారం తెలుసుకోండి: