ప్రపంచంలో రోజు రోజుకీ కొత్త టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందుతుంది.  ముఖ్యంగా ఇంటర్నెట్ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది.  ఒకప్పుడు ఇంటర్నెట్ కోసం నెట్ కేఫ్ లో కి వెళ్లి గంటల కొద్ది టైమ్ గడిపే వారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ పైఫై అందుబాటులోకి వచ్చింది.  టెలికాం నెట్ వర్క్ సంస్థలు ఇంటర్ నెట్ తక్కువ ధరకే అందిస్తుంది.  దీంతో స్మార్ట్ ఫోన్ ఉన్న వారికి అరచేతిలో ప్రపంచం ఉన్నట్లే అయ్యింది.
Image result for ఫిలిప్స్  లైఫై
తాజాగా  ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫిలిప్స్ ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తాజాగా ఆవిష్కరించింది. దీంతో త్వరలో లైఫై టెక్నాలజీ మనకు అందుబాటులోకి రానుంది. దీని ద్వారా సురక్షితమైన, వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను పొందేందుకు వీలుంటుంది.  ఇక వైఫై అంటే వైర్‌లెస్ తరంగాల ఆధారంగా పనిచేసే టెక్నాలజీ అని అందరికీ తెలిసిందే. అయితే లైఫై కాంతి తరంగాల ఆధారంగా పనిచేస్తుంది. అంటే ప్రత్యేకంగా తయారు చేయబడిన ఎల్‌ఈడీ లైట్లలో మోడెమ్‌ను అమరుస్తారు.
Image result for ఫిలిప్స్  లైఫై
ఈ క్రమంలో లైట్లను ఆన్ చేసినప్పుడు ఆ మోడెమ్ నుంచి కాంతి తరంగాలు లైట్ల ద్వారా బయటకు వస్తాయి. ఇక స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌కు అమర్చబడిన ప్రత్యేకమైన యూఎస్‌బీ డాంగిల్ ఆ కాంతి తరంగాలను గుర్తించి వాటిని ఇంటర్నెట్ తరంగాలుగా మార్చి డివైస్‌లకు ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఇలా లైఫై పనిచేస్తుంది.  లై ఫై వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సాధారణంగా వైఫై అయితే పెద్దగా సెక్యూరిటీ ఉండదు. కానీ గోడల ద్వారా వైఫై బయటకు కూడా ప్రసారం అవుతుంది.
Image result for ఫిలిప్స్  లైఫై
కానీ లైఫై కేవలం ఒకే చోట ఉంటుంది. గోడల ద్వారా ప్రయాణించదు. దీంతో లైఫై ద్వారా వచ్చే ఇంటర్నెట్‌కు సెక్యూరిటీ ఉంటుంది. ఇతరులు దాన్ని యాక్సెస్ చేయలేరు. ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం వినియోగదారులకు పూర్తి సెక్యూరిటీని అందిస్తుంది.కార్పొరేట్ కార్యాలయాల్లో, ఇతర సంస్థల్లో లైఫై ద్వారా ఇంటర్నెట్‌ను వాడితే అది సురక్షింగా ఉండడమే కాదు, సుస్థిరమైన, వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందిస్తుంది. 
ఫిలిప్స్ ఆవిష్కరించిన ఈ లైఫై టెక్నాలజీ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉంది. త్వరలో పూర్తి స్థాయిలో వాణిజ్యపరమైన వినియోగానికి అందుబాటులోకి రానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: