ప్రముఖ మెసేజింగ్‌ అప్లికేషన్‌ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రానుంది. ప్రస్తుతానికి వాట్సాప్ బీటా వెర్షన్ వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.  ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు వాడుతున్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ యూజర్లు కావడం మరో విశేషం. అయితే వినియోగదారులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు చేర్పులు తీసుకు వస్తుంది వాట్సాప్. 
Image result for వాట్సాప్‌
తాజాగా  ఈ యాప్‌ 10 స్థానిక భాషలను సపోర్టు చేస్తోందని తెలిసింది. హిందీ, మలయాళం, బెంగాళీ, పంజాబి, తెలుగు, మరాఠి, తమిళ్‌, ఉర్దూ, గుజరాతి, కన్నడ భాషలను ఇది సపోర్టు చేస్తోంది. ఈ వాట్సాప్ ఎలా ఉపయోగించు కోవాలంటే..ముందుగా యాప్ ను మీ భాషలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం..
Image result for వాట్సాప్‌
- వాట్సాప్‌ ఓపెన్‌ చేయాలి
- మెనూ బటన్‌ను ట్యాప్‌ చేయాలి
- సెట్టింగ్స్‌కు వెళ్లాలి
- ఛాట్‌కి వెళ్లి, అనంతరం యాప్‌ లాంగ్వేజ్‌ను ఓపెన్‌ చేయాలి
- పాప్‌ నుంచి మీకు నచ్చిన లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకోవాలి
- మీ ఫోన్‌ సామర్థ్యం బట్టి, ఇంగ్లీష్‌, హిందీ, బెంగాళి, పంజాబి, తెలుగు, మరాఠి, ఉర్దూ, గుజరాతి, కన్నడ, మళయాలం భాషల్లో మీకు కావాల్సిన దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 
- మీ ఫోన్‌ లాంగ్వేజ్‌ను వాట్సాప్‌ ఫాలో అవుతూ ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: