టెలికాం దిగ్గజ సంస్థ అయిన ఎయిర్టెల్ మళ్ళీ విపణిలో పుంజుకోవాలని చూస్తోంది..జియో దెబ్బకి కుదేలయిన ఎయిర్టెల్ మళ్ళీ తన సత్తాని మార్కెట్ లో చూపించాలని ప్లాన్ చేస్తోంది అందులో భాగంగా ఎప్పటికప్పుడు డేటా ప్లాన్స్ మార్చుతూ జియోకి షాకుల మీద షాకులు ఇస్తోంది..ఈ క్రమంలోనే ఎయిర్టెల్ ఒక భారీ ఆఫర్ ని విడుదల చేసింది అదేంటంటే..ఎయిర్టెల్ 181 రూపాయలతో ప్రీపెయిడ్‌ ప్లాన్

 Image result for airtel 181

ఈ ప్లాన్ లో రీఛార్జ్‌ చేసుకున్న కస్టమర్స్ కి రోజుకి 3 జీబీ డేటాను అందిస్తోంది. ఆయితే ఈ ప్లాన్ కొన్ని నిభంధనల ప్రకారం ఉండనుంది..రూ.181 ప్లాన్ ను రీఛార్జ్‌ చేసుకున్న యూజర్ కి రోజుకి 3 జీబీ ఇవ్వడమే కాకుండా వాయిస్‌ కాల్స్‌పై ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితి ఉండదు ఇండియా లో ఏ నెంబర్ కి అయిన అన్ లిమిటెడ్ కాల్స్ చేయవచ్చు. దీంతో పాటు రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. కానీ ప్లాన్‌ వాలిడిటీ మాత్రం కేవలం 14 రోజులు ఉంటుందని తెలిపింది.

 Image result for airtel 181 vs jio

అయితే జియో ఉంచీ వచ్చే పోటీని తట్టుకోవడానికి ఎయిర్టెల్ గతంలోనే రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకునే కస్టమర్లకు రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి...ఇస్తుండగా వ్యాలిడిటీ మాత్రం 48 రోజులుగా నిర్ణయించారు...అదేవిధంగా ఎయిర్టెల్ లో రూ.299కి మరో ప్లాన్ లో కస్టమర్లకు రోజుకు 1.4 జీబీ డేటా లభిస్తుంది. మిగిలిన బెనిఫిట్స్ అలాగే వస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ 42 రోజులుగా నిర్ణయించబడి ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: