జియో ,ఎయిర్టెల్ వంటి దిగ్గజ టెలికం కంపెనీల ధాటికి  చిన్నా చితకా కంపెనీలు మనుగడ సాగించలేని తరుణంలో ఒక్క సారిగా మళ్ళీ అలాంటి కంపెనీలు అన్ని తమ ఉనికిని చాటుకుంటున్నాయి...టెలికాం రంగంలో తమకంటూ గుర్తింపు చాటుకుంటున్నాయి..అయితే ఇందులో భాగంగానే ఐడియా వొడాఫోన్తో జత కట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రెండు దిగ్గజాలకు ధీటుగా ఆపర్లను ప్రకటించి జారిపోతున్న తమ కస్టమర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి..

 

 అందులో భాగంగానే జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలను దెబ్బకొట్టేలా వోడాఫోన్‌ రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌ ని తమ కస్టమర్ల కోసం తీసుకొచ్చింది.ప్రీపెయిడ్‌ కస‍్టమర్లకోసం 279 రూపాయల రీఛార్జ్ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌కాల్స్‌,వారనికి 4జీబీ డేటా, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది...అంతేకాదు వ్యాలిడిటీ విషయంలో దిగ్గజ కంపెనీలకి బిగ్ షాక్ ఇచ్చింది..ఇప్పటివరకూ ఎ టెలికం  కంపెనీ ఇవ్వని 84 రోజుల వాలిడిటీ వొడఫోనే ఇస్తుంది

 

అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ప్రస్తుతానికి ఈ ప్లాన్ కేవలం కర్ణాటక,ముంబై ఇతర రాష్ట్రాలలో సర్కిల్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది...జియో అందిస్తున్న రూ.348 తో 84 రోజులు వాలిడిటీ ఇవ్వగా వోడాఫోన్ రూ.279 కే 84 రోజుల వాలిడిటీ ని ఇస్తుంది..దాంతో దేశీయ మార్కెట్ లో వోడా దూసుకుపోవడంలో సందేహం లేదని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు..


మరింత సమాచారం తెలుసుకోండి: