భారతీయులకి ఒక పట్టాన ఏదీ నచ్చదు..అలాగే ఏదన్నా నచ్చితే దాని వదిలిపెట్టరు. ఇప్పుడు ఇదే తరహాలు భారతీయులని ఎంతగానో ఆకట్టుకున్న ఏకైక స్మార్ట్ ఫోన్ గా షావోమి  బ్రాండ్ స్మార్ట్ ఫోన్ లు నిలిచాయి..ప్రతి     ముగ్గురు భారతీయుల్లో ఒకరు.. అన్ని ఫీచర్లతో బడ్జెట్‌ ధరలో అంటే 10 - 15 వేల రూపాయల మధ్య లభించే స్మార్ట్‌ఫోన్‌కే తమ ఓటు అంటున్నట్లు సర్వేలు వెల్లడిస్తుతున్నాయి.

 

మధ్యస్థాయి వినియోగదారుల మోస్ట్‌ ప్రిఫరబుల్‌ బ్రాండ్‌గా షావోమి  ఫోన్లు ముందు వరుసలో నిలిచాయంటున్నారు ఇందులో ‘షావోమీ’ భారతీయుల మోస్ట్‌ ప్రిఫరబుల్‌ బ్రాండ్‌గా నిలిచింది. ఆ తరువాతి వరుసలో శాంసంగ్‌ బ్రాండ్‌ స్మార్ట్ ఫోన్ లు నిలిచాయి.ఎక్కువ మంది మొదటిసారి కొన్న స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే.. రెండోసారి, మూడోసారి మాత్రం ఎక్కువ అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కోనేందుకు ఇష్టపడుతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది.

 Image result for mi mobiles

అయితే స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్న ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు హై ఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటుండగా.. ఐదుగురిలో నలుగరు ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌తోనే సర్దుకు పోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు  25 - 40 వేల రూపాయల మధ్య ఫోన్‌ కొనాలని భావించే వాళ్లు ఎక్కువగా వన్‌ప్లస్‌  బ్రాండ్‌ను ప్రిఫర్‌ చేస్తున్నట్లు తెలిసింది. 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: