ఇంటర్నెట్ విరివిగా అందుబాటులోకి వచ్చిన తరువాత మాములుగా కాల్స్ చేసుకునే వారి సంఖ్య దాదాపు తగ్గిపోయింది. వాట్సాప్ ,ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా కాల్స్ చేసుకునే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది.వాట్సాప్ , ఫేస్బుక్ ల ద్వారా ఆడియో , వీడియో కాల్స్ కూడా చేసుకుంటున్నారు.అయితే మాములుగా చేసుకునే కాల్స్ ఫోన్ లో ఉండే వాయిస్ రికార్డర్ ద్వారా భద్రపరుచుకోవచ్చు మరి సోషల్ మాధ్యమాల ద్వారా చేసుకునే కాల్స్ ని ఎలా బద్రపరుచు కోవాలి..?? మళ్ళీ వాటిని ఎలా చూసుకోవాలి అంటే...

 Image result for whatsapp audio video record

అందుకు ఒక యాప్ ని మీ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. “క్యూబ్‌ కాల్‌ రికార్డర్‌” అనే యాప్‌ ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇది మామూలు ఫోన్ కాల్స్ రికార్డ్‌ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. ఒకవేళ ఇది మీకు పని చేయకపోతే మెసెంజర్‌ కాల్‌ రికార్డర్‌ అనే యాప్‌ గూగుల్‌లో వెదికి థర్డ్‌ పార్టీ సైట్‌ నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు అలాగే  వీడియో కాల్స్‌ రికార్డ్‌ చేసుకోవాలంటే “ఎజెడ్‌ స్ర్కీన్‌ రికార్డర్‌” వంటి యాప్స్‌ వాడి ఫోన్‌ స్ర్కీన్‌ని ఉన్నది ఉన్నట్లు రికార్డు చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: