వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త రూపుని దిద్దుకుంటూ ముందుకు వెళ్తుంది. పండగల సమయం మొదలు, అనేక సెలబ్రేషన్స్ లో వాట్సప్ తనదైన శైలిలో యూజర్ల కి అందుబాటులో ఉంటోంది. అందులో భాగంగానే దీపావళి కానుకగా  వాట్సాప్ దీపావళి స్టిక్కర్స్ ని ప్రవేసపెట్టింది. ఈ ఫీచర్‌ను వాట్సాప్ ఆండ్రాయిడ్, వాట్సాప్ ఐఓఎస్ అలానే వాట్సాప్ వెబ్ యూజర్లు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవచ్చు.

 Image result for whatsapp diwali stickers

మరి ఈ స్టిక్కర్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం..

 

step -1

వాట్సాప్ స్టిక్కర్స్ మీ ఫోన్‌లో ఓపెన్ అవ్వాలంటే, తప్పనిసరిగా మీ వాట్సాప్ వెర్షన్‌ను 2.18 లేదా అంతకంటే హయ్యర్ వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అయి ఉండాలి. యాప్‌ను అప్‌డేట్ చేసుకున్న తరువాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ముందుగా యాప్‌ను ఓపెన్ చేసి చాట్ విండోలోకి వెళ్లాలి.

 Image result for whatsapp diwali stickers

step - 2

అక్కడ స్టిక్కర్స్‌ను యాక్సిస్ చేసుకునేందుకు స్మైలీ(smiley) ఐకాన్ పై క్లిక్ చేయాలి. స్మైలీ ఐకాన్ పై క్లిక్ చేసిన వెంటనే GIF ఐకాన్‌తో stickers ఐకాన్ మీకు కనిపిస్తుంది. వీటిలో stickers ఐకాన్ పై టాప్ చేసినట్లయితే స్టిక్కర్ స్టోర్ లోకి వెళతారు. ఇక్కడ మీకు అన్ని రకాల స్టిక్కర్ ప్యాక్స్ కనిపిస్తాయి

 

 Image result for whatsapp diwali stickers

step-  3

పేజ్ బోటమ్‌లో కనిపించే 'Get more stickers' ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే గూగుల్ ప్లే స్టోర్‌లోకి రీడైరెక్ట్ కాబడతారు. ఇక్కడ మీకు నచ్చిన దివాళీ స్టిక్కర్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టిక్కర్స్ డౌన్‌లోడ్ అయిన తరువాత వాటిని ఓపెన్ చేసి 'Add to WhatsApp' అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

 

 

step - 4

ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే మీరు ఎంచుకున్న దీపావళి స్టిక్కర్స్ మీ యాప్ లోకి వచ్చేస్తాయి. వీటిని గ్రీటింగ్స్ రూపంలో మీరు ఎవరికైనా షేర్ చేసుకునే వీలుంటుంది. ఐఫోన్ యూజర్లకు ప్రస్తుతం వాట్సాప్ స్టిక్కర్స్ ను డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. రిసీవ్ చేసుకున్న స్టిక్కర్స్‌ను ఫేవరెట్‌గా మార్క్ చేసుకున్న తరువాత మాత్రమే వారు ఇతరులకు ఈ సెండ్ చేయగలుగుతారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: