ఇప్పటి ప్రపంచంలో అందరూ సోషల్ మీడియాలోని మునిగితేలి పోతున్నారు. కుదిరితే వాట్సప్ లేదంటే ఫేస్బుక్ లు ప్రపంచంలా భావిస్తూ వాటిపైనే దృష్టిపెడుతున్నారు తప్ప మరొక ధ్యాస ఉండటంలేదు..వాటిలో సగం మంచి సగం చెడు రెండు సమపాళ్ళలో ఉన్నాయనుకోండి..అయితే ఎంతో విలువైన సమాచారం వాట్సాప్ లో నిక్షిప్తమయ్యి ఉంటుంది అయితే ఇప్పుడు ఆ బ్యాకప్ మొత్తం డెలీట్ అయిపోయే ప్రమాదం ఉందని వాట్సాప్ హెచ్చరిస్తోంది.వివరాలలోకి వెళ్తే..

 Image result for whatsapp backup

12 నెలలుగా బ్యాకప్ తీసుకోకపోతే వీడియోల, ఫొటోలు, సహా పాత చాటింగ్ అంతా గూగుల్ డ్రైవ్ నుంచి డిలీట్ అవుతుందని వాట్సాప్ తెలిపింది..ఇప్పుడు ఉన్న డేటా మొత్తాన్ని పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసుకోవాలి..ఆ తర్వాత బ్యాకప్ తీసిన ప్రతిసారీ పాత బ్యాకప్ ఫైళ్లు అప్‌డేట్ అవుతుంటాయి.అయితే మనం డేటాని నష్టపోకుండాఉండాలి అంటే.. 2018 నవంబర్ 12లోగా ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ చాటింగ్‌ బ్యాకప్‌లో సేవ్ చేసుకోవాలని వాట్సాప్  సూచించింది. ఈ సమస్య యాపిల్ వినియోగదారులకు లేదని తెలిపింది..మరి ఈ విధానం ఎలా అంటే..

 Image result for whatsapp backup

1. వాట్సాప్ ఓపెన్ చేయాలి.

2. సెట్టింగ్స్‌ > చాట్ > బ్యాకప్

3. 'సేవ్ ఇన్ గూగుల్ డ్రైవ్' క్లిక్ చేయాలి. ఎన్ని రోజులకోసారి బ్యాకప్ తీయాలనుకుంటున్నారో ఎంచుకోవాలి.

4. మీకున్న గూగుల్ డ్రైవ్ ఖాతాల్లో దేనికి ఆ బ్యాకప్‌ను జతచేయాలనుకుంటున్నారో ఎంచుకోవాలి.

5. ఏ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌తో(మొబైల్ డేటా లేదా వైఫై) ఉన్నప్పుడు బ్యాకప్ తీయాలో ఎంచుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు బ్యాకప్ పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే విలువైన సమాచారం మనకి తెలియకుండానే తొలగించబడుతుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: