నేడు రోజంతా మొబైల్‌ వీడియో గేమ్స్‌లో చిన్నపిల్లలు మునిగితేలుతున్నారు. ఇప్పుడు మినీ ఆట స్థలాలుగా... క్రీడాప్రాంగణాలుగా మొబైల్‌ఫోన్లు మారుతున్నాయి. పిల్లలు ఆరు బయట ఆడటం లేదు. ఇంట్లో పెద్దలతో మాట్లాడటం తగ్గిపోవడం జరుగుతోంది. మితిమీరిన విధంగా ఈ ఎలక్ట్రానిక్‌ ఉప కరణాలను ఉపయోగించడం వల్ల పిల్లలపై దుష్ప్రభావం క్రమేణ పెరుగుతోంది. నిపుణులు వైద్యులు మొబైల్‌ వినియోగం గంటకు మించి వాడటం మంచిదికాదు. ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు. 


స‌హ‌జంగా  పిల్లలకు సెలువులు వచ్చాయంటే ఒకప్పుడు పిల్లలంతా ఆరుబయట ఆట స్థలాలలో ఆడుతూ కనిపించేవారు. పిల్లలు మొబైల్‌ ఫోన్లకు టీవీలకు అలవాటుపడిపోయి ఆటలాడటం మరిచిపోతున్నారు. మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, వీడియోగేమ్స్‌ వంటి ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు చిన్నపిల్లలపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే వీటి వాడకం పెరిగితే చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఉబకాయం, కంటి సమస్యలు, మున్ముందు మధుమేహం వంటి అనారోగ్యాలు దరిచేరే ప్రమాదముందని హెచ్చరిస్తోంది. 


స్మార్ట్ ఫోన్ల‌లో గంట‌ల‌కు గంట‌లు ఆడుతోన్న పిల్లల‌కు కంటి చూపు కూడా మంద‌గిస్తోంది. వారు చిన్న వ‌య‌స్సులోనే తీవ్ర‌మైన అనారోగ్యాల‌కు గుర‌వుతున్నారు. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను అధికంగా వినియోగించడం వల్ల పిల్లల్లో మానసిక ఎదుగుదల కూడా ఉండటం లేదు. అలాగే సెల్‌ఫోన్లకు, ట్యాబ్‌లకు అతుక్కుపోయే పిల్లలు సామాజిక సంబంధాలకు దూరమవుతున్నారు. ఇతరులతో ఎలా ? మాట్లాడాలో కూడా గ్రహించడంలేదు. 


యూట్యూబ్‌ను ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది చూస్తున్నారని, అందులో పిల్లలు కూడా న్నారని తేల్చింది. ఇది పిల్లల మెదళ్లపై చెడు ప్రభావం చూపిస్తుందని తాజా అధ్య‌య‌నం పేర్కొంది. రెండు నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలు రోజుకు గంట కంటే ఎక్కువగా సేపు స్మార్ట్ ఫోన్స్ వంటి ప‌రిక‌రాలు వాడ‌కూడ‌ద‌ని నిపుణులు హెచ్చ‌రించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: