ఇటీవ‌ల ఆధార్ కార్డు అనేది ఇప్పుడు అందరికీ చాలా ముఖ్యమైనది. ప్రతి దానికి ఇప్పుడు ఆధార్ లింక్ అడుగుతున్నారు. అందువల్ల ఆధార్ కార్డును చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఆధార్ కార్డులో నిరాశ‌పరిచే విషయం ఏంటంటే అందులో ఉండే ఫోటో. చాలామంది ఆధార్ కార్డులో ఉండే ఫోటో సరిగా ఉండదు.అయితే ఈ ఆధార్ కార్డులో ఫోటో మంచిగా కావాలనుకుంటున్నారా.

మీరు మీ ఫోటోని మార్చుకోవాలనుకుంటున్నారా..అయితే ఎలా మార్చుకోవాలనేదానిపై మీకు కొన్ని రకాల టిప్స్ ఇస్తున్నాం. ఓ సారి లుక్కేయండి. ప్రభుత్వ రూల్స్ ప్రకారం మీరు మీ ఫోటోని మార్చుకోవచ్చు. ఇందుకోసం మీరు ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కెళ్లి అక్కడ మీ ఫోటో అప్ డేట్ చేయమని అడిగితే సరిపోతుంది. మీరు రెండు దారుల ద్వారా ఆధార్ కార్డు ఫోటోను మార్చుకోవచ్చు. 


అయితే ఆఫ్ లైన్ ద్వారానే మీరు ఫోటో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా సాధ్యం కాదు. దీనికోసం మీరు ముందుగా Aadhaar Update form https://uidai.gov.in/images/UpdateRequestFormV2.pdf ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని నింపాలి. దాన్ని మీరు UIDAI కి పంపిస్తే వారు వివరాలు చెక్ చేసుకుని మీకు మీరు పంపిన ఫోటో కార్డుతో ఐడీకార్డుని పంపిస్తారు. మీకు దగ్గర్లో ఉన్న ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కెళ్లి అక్కడ మీ ఫోటోని అప్ డేట్ చేయమని అడగండి. 


ఇది 2 వారాల ప్రాసెస్ తీసుకుంటుంది. దీనికి ఛార్జ్ కింద రూ.15 తీసుకుంటారు. 5 సంవత్సరాల వారి ఫోటోను ఆధార్ లో తీసుకోరు. 15 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్నవారి ఫోటో మాత్రమే అప్ డేట్ చేస్తారు. అయితే ఇక ఆల‌స్యం చేయ‌కుండా మీకు న‌చ్చిన విధంగా మీ ఫోటో మార్చుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: