సాధార‌ణంగా చాలా ఆండ్రాయిడ్ ఫోన్‌లు పీసీతో ఫైల్‌లను ఛార్జింగ్ మరియు బదిలీ చేయడానికి మైక్రో యూఎస్‌బీ పోర్ట్‌లను ఉపయోగిస్తారు. అయితే డేటా స్టోరేజీ విషయంలో వినియోగదార్లను తృప్తిపర్చడం ఏ కంపెనీకీ సాధ్యపడదేమో. ఇటీవల కాలంలో డేటా స్టోరేజీ విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌, సిస్టమ్‌... ఏదైనాకానీ... స్టోరేజీ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ఈ క్ర‌మంలోనే స్మార్ట్‌ ఫోన్లలో ఇప్పటికే జీబీల కొద్ది డేటా స్టోరేజీ అందుబాటులో ఉంది. దాంతో పాటో సిస్టమ్‌లోకి బ్యాకప్‌ తీసుకునే సౌలభ్యమూ ఉంది.


కొన్ని సందర్భాల్లో ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ లేదా టాబ్లెట్‌కు పెన్‌డ్రైవ్‌ను కనెక్ట్‌ చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుంద‌ని అనిపిస్తుంది. ఆ కోరికను ఇప్పుడు చాలా సులభంగా తీర్చుకోవచ్చు. ఇప్పుడు ఆండ్రాయిడ్‌ ఫోన్లకు పెన్‌డ్రైవ్‌ కనెక్ట్‌ చేసుకునే సదుపాయమూ అందుబాటులో ఉంది. దీంతో మొబైల్‌ వినియోగదారుల స్టోరేజీ సమస్యా తొలగిపోయినట్లే. చాలావరకు మార్కెట్లో అందుబాట్లో ఉన్న ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో మైక్రోఎస్డీ స్లాట్‌ను పలు కంపెనీలు అందిస్తున్నాయి.


ఇంటర్నల్‌గా విస్తరించుకోడానికి అవసరమైన కార్డ్‌స్లాట్‌లు ఉండే ఫోన్‌లలో దాదాపుగా స్టోరేజ్‌ సమస్యలు తొలగినట్లేనని చెప్పవచ్చు. మన ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు పెన్‌డ్రైవ్‌ను కనెక్ట్‌ చేసుకోవాలంటే ముఖ్యంగా On-The-Go (OTG)  ఫీచర్‌ ఉండాలి. ఒకవేళ ఈ సదుపాయం మీ ఫోన్‌లో లేకపోతే... USB OTG checker యాప్‌ను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అప్పుడూ మీ ఫోన్‌కు OTG సపోర్టు చేయకపోతే... ఫోన్‌ను రూట్‌ చేయాల్సి ఉంటుంది.


అప్పుడు మీ ఫోన్‌కు USB OTG సపోర్ట్‌ లభిస్తుంది. ఆ తర్వాత OTG కేబుల్‌ను ఒకవైపు ఫోన్‌కు, మరోవైపు పెన్‌డ్రైవ్‌కు కనెక్ట్‌ చేయాలి. అలా కనెక్ట్‌ అయిన వెంటనే యూఎస్బీ సింబల్‌ ఫోన్‌ స్క్రీన్‌ పై వ‌స్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: