స‌హ‌జంగా శ్రావ‌ణ మాసం వ‌చ్చిదంటే అంద‌రూ బంగారం కొనేందుకు ఆస‌క్తి చూపుతారు. నిజానికి మాములు రోజుల్లో రోజుకు రూ.7కోట్లు వరకు టర్నోవర్ అయితే.. శ్రావణ మాసంలో మాత్రం మూడింతలు వ్యాపారాలు పెరుగుతాయి. అయితే ఆ సారి మాత్రం జ‌నాలు బంగారం కొన‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. అంత‌గా ప‌సిడి ధ‌ర ప‌రుగులు పెడుతోంది. గ‌త వారం మేలిమి బంగారం గ్రాము రూ. 3,600 ఉండ‌గా ప్రస్తుతం రూ.3,700 పలికింది. అంటే గ్రామ‌కు 100 పెర‌గ‌డంతో అంద‌రూ అశ్చ‌ర్య‌పోతున్నారు. నిజానికి ఆల్ టైం రికార్డు ధ‌ర‌ క్రియేట్ చేసింది.


అయితే అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ పరిస్థితుల కార‌ణంగా స్టాక్‌మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే బంగారంపై పెట్టుబ‌డులు పెడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం కూడా బంగారంపై 10 శాతం ఉన్న కస్టమ్స్‌ పన్నును 12.5 శాతానికి పెంచడం ధ‌ర పెర‌గ‌డానికి మ‌రో కార‌ణం.ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్‌ డ్యూటీ  2.5శాతం ఎక్కువ‌ పెంచడంతో రూ.34వేలకు పెరిగింది.  


గ‌త సంవ‌త్స‌ర‌తం శ్రావణమాసంలో 10 గ్రామల బంగారం ధర రూ.31,800 ఉంది. అయితే ఈ సంవ‌త్స‌రం మే నెల నాటికి 10 గ్రాముల బంగారం ధ‌ర  ఏకంగా రూ.35,200ల‌తో తారా స్థాయికి చేరుకుంది. అలాగే బంగారం ధ‌ర‌తో పాటు వెంటి ధ‌ర కూడా సై అంటుంది. ఈ క్ర‌మంలోనే కిలో వెండి రూ.44వేలు పలుకుతోంది. ఇక సోమ‌వారం నుంచి బంగారం ధ‌ర‌లు ఆకాశాల‌ను అంటుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎవ్వ‌రూ కూడా బంగారం కొన‌డానికి ఆస‌క్తి చూడ‌పం లేదు. అయినా రేటు మాత్రం చుక్క‌ల్లోనే ఉంటోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: