ప్రపంచాన్ని ఏం చేద్దామని ఈ కరోనా నిర్ణయించుకుందో తెలియదు గానీ ప్రస్తుతానికైతే ప్రజలందరు భయాలతో కృంగిపోయేలా చేస్తుంది.. క్షణ క్షణానికి శక్తివంతమైన ప్రభావంతో వ్యాప్తి చెందుతూ, ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.. ఇక కరోనాను సృష్టించిన సృష్టికర్త చైనా మాత్రం తీరిగ్గా తనపనులు తాను చేసుకుంటుంది.. అక్కడి వైద్యులు ప్రాణాలకు తెగించి ఈ వైరస్‌ను నాశనం చేయడానికి శ్రమిస్తున్నారు..

 

 

ఇదిలా ఉండగా ఈ వైరస్ ప్రభావం మనుషుల మనసుల పై తీవ్రంగా పనిచేస్తుందనడానికి కొందరు చేస్తున్న పిచ్చి పనులే నిదర్శనం..అదేమంటే ఈ వైరస్ సోకిన దేశాల్లో ఒక్కొక్క పరిస్దితి నెలకొనగా ఇరాన్‌లో మాత్రం పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఈ వైరస్ నేపథ్యంలో అక్కడి ప్రజలు చేస్తున్న పనుల గురించి తెలిస్తే హడలిపోవడం ఖాయం.. ఇప్పటికే ఇరాన్‌లో కరోనా విషయంలో అక్కడి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టగా ఇరాన్ ప్రజలు మాత్రం తమకు కరోనా వైరస్ అంటే భయం లేదని, తమని ఆ దైవమే రక్షిస్తుందంటూ వింత చేష్టలకు పాల్పడుతున్నారు.

 

 

కరోనా తొలికేసు నమోదైన కోమ్ నగరంలో నివసిస్తున్న ప్రజలు ఈ వైరస్‌ పెద్దగా పట్టించుకోవడం లేదు. దైవమే తమని రక్షిస్తుందంటూ పుణ్యక్షేత్రాలకు వెళ్లడమే కాకుండా అక్కడి గోడలను, గ్రిల్స్‌ను నాకుతున్నారు. ఇకపోతే కరోనా వైరస్ లాలాజలం నుంచి త్వరగా వ్యాప్తి చెందుతుందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రజలు చేస్తున్న పనికి అంతా ఆశ్చర్యపోతున్నారు.

 

 

ఇరాన్ అధికారులు.. ఆలయాల్లోని గోడలు. గ్రిల్స్‌ను శుభ్రం చేసే పనిలో పడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిని అరెస్టు చేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా గాని అక్కడి ప్రజలు తమ పిచ్చి పనులను ఆపడం లేదు.. మనుషులు చేసిన తప్పిదాలకు భగవంతుడు కాపాడుతాడనే నమ్మకంతో వారు చేసే చర్యలవల్ల ఈ వ్యాధి మరింతగా ప్రబలే అవకాశం ఉంది.. ఈ విషయన్ని మరచిన ఇరాన్ ప్రజలు ఇలా చేయడం బాధాకరం.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: