జంతువులు చూపించే విశ్వాసం ముందు అన్ని ఆలోచించగల మనుషులు సరిపోరనిపిస్తుంది.. ఎందుకంటే సమాజంలో మానవులకు ఎంతగా సహాయం చేసినా తిన్నింటి వాసాలు లెక్కపెడుతారు.. ఎంత ప్రేమగా చూసినా, జీవితంలో మనవారు అని నెత్తిన పెట్టుకున్న, ఇంకా కోట్ల ఆస్తి ఉంటే రాసిచ్చిన, బంధువులు, బంధుత్వాలు, రక్త సంబంధాలు ఇవేవి స్వార్ధం ముందు నిలబడలేవు.. పెట్టింది తిన్నంత సేపటివరకు భజన చేస్తారు.. మరొకడు వచ్చి ఇంతకంటే ఎక్కువ పెడితే అతనికి జై కొడతారు.. ఇది మానవ నైజం..

 

 

ఒక రకంగా మనుషులకంటే జంతువులు మేలు. వాటిని ప్రేమగా చూసే యజమాని పట్ల విశ్వాసాన్ని, ప్రేమను నిస్వార్ధంగా చూపిస్తాయి.. ఇలాంటి వాటికి నిదర్శనంగా ఎన్నో సంఘటనలు అక్కడక్కడ ఎదురవుతుంటాయి.. ఒక జంతువులే కాదు పక్షులకు కూడ విశ్వాసం ఎక్కువే అందుకే వాటిని పోషించే యజమానికి ఏదైన ఆపద వస్తే అసలు ఊరుకోవు.. ఈ విషయంలో ఒక కుక్కనే కాదు,మిగతా జంతువులు కూడా ఏం తక్కువ కాదని ఈ ఘటన నిరూపిస్తుంది.

 

 

అదేమంటే ఒక ఎద్దును సాకుతున్న వ్యక్తిని అతని స్నేహితులు కావాలని కొడుతున్నట్లుగా నటించగా ఆ దృష్యాన్ని చూసిన ఆ ఎద్దు వేగంగా పరిగెత్తుకుంటు వచ్చి వారిని తరిమేస్తుంది.. అంతే కాకుండా మళ్లీ వారు తన యజమానికి ఏదైన ఆపద తలపెడతారేమోనని అక్కడే ఉండి వారిని దగ్గరికి రాకుండా చేస్తుంది.. ఆ ఎద్దుకు తెలియదు కదా వీరంతా తన యజమాని స్నేహితులని.. తన విశ్వాసానికి వారు పరీక్ష పెట్టారని.. నోరులేని ఆ జంతువు తన కర్తవ్యాన్ని తాను సక్రమంగా నెరవేరుస్తుంది..

 

 

ఇప్పుడు చెప్పండి మనుషులకంటే జంతువులు ఎన్నో రెట్లు గొప్పవా, కావా.. ఒక్క పూట ఇంత తిండి పెడితే చచ్చేదాక అతని పట్ల విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి.. ఇకపోతే సరదాకి తీసిన ఈ వీడియోలో చాలా నీతి ఉంది. నేటి సమాజంలో మనుషుల వ్యక్తిత్వాన్ని ఈ ఎద్దు సూటిగా ప్రశ్నిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇక ప్రస్తుతం  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది... 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: