కొంతమంది పిల్లలు చూడటానికి చిన్నపిల్లలు.. కానీ చేసేవి అన్ని పెద్ద పనులు. అంటే వారికీ తెలిసి ఎం ఆ పనులు చెయ్యరు.. తెలియకుండానే ఆ పనులు చేస్తారు.. ఇప్పుడు అంత దారుణమైన పని ఎవరు చేశారు?  ఇప్పుడు ఏమైంది అని అనుకుంటున్నారు కదా! అక్కడికే వస్తున్న.. అసలు ఏమైంది అంటే? 

 

ఓ ఐదేళ్ల బుడ్డోడు తన తండ్రితో కలిసి పొలానికి వెళ్ళాడు. అయితే అక్కడ ఆ బాలుడు ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నాడు. ఇంకా తండ్రి కూడా పొలాన్ని అంత వీడియో తియ్యడంలో నిమగ్నమయ్యాడు. దీంతో కొడుకు ఎటువైపు వెళ్తున్నాడు అనేది తండ్రి గమనించలేదు.   

     

IHG

 

ఇంతలో ఆ బుడ్డోడు.. ఏదో తాడు అనుకుని పామును పట్టుకున్నాడు. అంతే అది ఒక్కసారి కదిలి పడగవిప్పింది. ఈ హఠాత్పరిణామానికి ఇద్దరూ హడలిపోయారు. ఎక్కడ కొడుకుకు కాటు వేస్తుందో అని తండ్రి బెదిరిపోయాడు. అయితే అదృష్టవశాత్తు ఆ పాము ఆ బాలుడిని కాటు వేయలేదు. దీంతో తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. 

 

ఇంకా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అత్యంత భయంకరమైన ఘటన కర్ణాటకలోని బెల్గాంలో చోటుచేసుకుంది. కాగా ఈ లాక్ డౌన్ ఇలాంటి దారుణమైన సెన్సేషన్ ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం హితబోధన చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.                    

 

మరింత సమాచారం తెలుసుకోండి: