సాహసాలతో కూడిన వైవిధ్యభరితమైన జీవితానికి చాలా తక్కువ మంది మాత్రమే అలవాటుపడతారు.. ఇక్కడ ధైర్యం, సాహసం అంటే ఒకరిని ఒకరు అర్ధం పర్ధం లేకుండా కొట్టుకోవడం కాదు.. ఎదురుగా మృత్యువు ఉన్నా కూడా బెదిరిపోకుండా ధైర్యంగా నిలబడటం.. ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా నేషనల్ జీయోగ్రఫీలో కనిపిస్తారు.. ఏ క్షణం ప్రాణాలు పోతాయో తెలియని స్దితిలో శత్రుసైన్యం ఎప్పుడు దాడి చేసినా ఎదుర్కొనే ధైర్యం గుండెల నిండా నింపుకుని, ఎముకలు కొరికే చలిని భరిస్తూ మన దేశభద్రత కోసం సరిహద్దుల్లో పహారా కాసే సైనికులు కూడా అచ్చమైన వీరులే.. వీరు సాహసానికి చిరునామ..

 

 

ఇకపోతే ఈ సాహసంలో ఉన్న మరోరకం వారు సఫారి పర్యటనలోని పర్యాటకులు.. వీరు కౄరమృగాలను చాలా దగ్గరగా చూడడానికి ఇష్టపడతారు.. వీరు చేసేపని వల్ల ఎవరికి లాభం, ఉండదు కానీ వీరికి మాత్రం ఆత్మ సంతృప్తి కావలసినంత దొరుకుతుంది.. ఇలాగే ఓ టూరిస్ట్ బృందం పర్యటనకు సఫారి పార్క్‌లోకి డోర్స్ లేని ఒపెన్ వాహనంలో వెళ్లుతుండగా అక్కడే ఉన్న సింహం వీరిని చూసి దగ్గరికి వచ్చి.. వారు వచ్చిన వాహనంలోకి ఎక్కి అందరిని ప్రేమగా పలకరిస్తుంది.. నిజానికి సింహా అక్కడున్న మనుషులను తన కాళ్లతో చుట్టేస్తే బీపీ, గుండెజబ్బులు ఉన్నవారు మాత్రం ఈ పరిమాణామానికి టపాకట్టడం ఖాయం అనిపిస్తుంది.. ఇక ఆ వ్యాన్ డ్రైవర్ ఆ సింహాన్ని పక్కకు పంపినా వెళ్లకుండా ఆ వ్యానులో ఉన్న అందర్ని తనివితీరా హద్దుకుంటుంది..

 

 

ఇక దూరంగా సింహం ఉందంటేనే చెడ్డి తడుపుకునే మనుషులు, కౄరమృగాలను ఇంత దగ్గరగా చూస్తే ఇంకేం అయినా ఉందా.. వీరికి కూడా మనసులో భయం ఉన్న ఏదో మొండి ధైర్యంతో ఈ క్షణాలను ఎంజాయ్ చేసారు.. కానీ ఈ రకమైన పర్యటన మాత్రం ప్రాణాలకు ఎప్పుడైనా ప్రమాదామే.. సరదాగ నవ్వుతూ ఉండే మనిషి సడెన్‌గా కోపానికి రావడం కొందరిలో చూస్తూనే ఉంటాం.. మరి మనుషులను ఐస్ క్రీంలా చప్పరించే అడవి మృగాల మనస్తత్వం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసు కోవడం కాస్త కష్టమే.. ఇక వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: