ఈ ప్రపంచంలో కొందరు మాత్రమే అచ్చమైన ధైర్యానికి చిరునామా.. అలాంటి వారు చేసే రిస్క్ వల్ల చూసే వారి మతి పోవలసిందే.. కానీ వీరు ప్రాణాలకు తెగించి మరీ అంత సాహసం ఎందుకు చేస్తారో అర్ధం కాదు.. వీరు చేసేపనిలో ఏమాత్రం తేడా వచ్చినా, కాస్త ఎమరుపాటుగా ఉన్నా వీరి ఊపిరి గాల్లో కలవ వలసిందే.. ఇక ప్రపంచంలో సోషల్ మీడియా జోరు పెరిగిన తర్వాత ఏమూల ఎవరు ఏం చేసినా ఆ వీడియోలు క్షణంలో కళ్లముందు ప్రత్యక్షం అవుతున్నాయి.. ఇలాంటి దృశ్యాల్లో కొన్ని వినోదాత్మకంగా, సరదాగా అనిపిస్తే, కొన్ని రిస్కీస్టంట్లు మాత్రం, ఒంట్లో భయాన్ని పుట్టిస్తాయి.. అలాంటి ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది..

 

 

ఇక ఈ వీడియో చూస్తున్నంత సేపు గుండెలో దడ, ఒంటికి చెమటలు పట్టడం మాత్రం ఖాయం.. ఇంతగా ఈ వీడియోలో ఏముందని అంటారా.. అయితే మీరే చూడండి.. ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో ఓ యువకుడు ప్రమాదకరంగా ఉన్న కొండ అంచు వద్దకు వెళ్లి, కొండ చివరన రిస్కీ స్టంట్‌ చేసి ఔరా అనిపించాడు.. అంత ఎత్తు ఉన్న కొండమీది నుండి క్రిందకు చూస్తేనే కళ్లు తిరుగుతాయి.. అలాంటిది అక్కడ అలాంటి స్టంట్ చేయడం అంటే మాటలు కాదు.. అసలు ఊహించుకోవడానికి కూడా వీలు లేదు.. కానీ ఈ యువకుడు కొండ అంచున ఏ మాత్రం భయం లేకుండా బ్యాక్‌ ప్లిప్‌ వేశాడు.

 

 

ప్రాణాలు గాల్లోనే పోయే అవకాశముందని తెలిసినా ఆ యువకుడు చేసిన రిస్కీ స్టంట్‌ చూస్తే బీపీ ఉన్న వారికి హై బీపీ, రావడం మాత్రం ఖాయం. ఇంతకు ఇతను ఇంట్లో చెప్పివచ్చాడో లేదో అని ఈ వీడియో చూసిన నెటిజన్స్ మాత్రం క్లాస్ పీకుతున్నారు. ఇక ఇతను చేసింది పెద్ద సాహసమే కావాచ్చూ, కానీ తెలిసి తెలిసి ఇంత మూర్ఖత్వమైనా సాహసం పనికి రాదంటున్నారు.. ఇకపోతే ప్రముఖ వ్యాపారవేత్త హర్షా గోయెంకా సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్‌ చేయగా 63 వేలకుపైగా వ్యూస్ వచ్చాయట.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: