పిల్లలకు ఈవెనింగ్ స్నాక్స్ లో ఏది పెట్టాలో తెలియదు.. ఏది చేస్తే వారు బాగా ఇష్టంగా తింటారు అనేది ఇంకా తెలియదు. అయితే వెజిటేబుల్ పకోడీ ఎంతో రుచిగా ఉంటుంది. ఈ వంటకాన్ని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈ వెజిటేబుల్ పకోడితో పిల్లలు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే అది ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 


కావాల్సిన పదార్థాలు... 


శెనగపిండి - ఆరు కప్పులు, 


బంగాళాదుంపలు - రెండు, 


ఉల్లిపాయలు - రెండు, 


క్యాప్సికమ్ - రెండు, 


ఉప్పు - రుచికి సరిపడా, 


నూనె - తగినంత, 


డ్రై మ్యాంగో పొడి - రెండు టీస్పూనులు, 


కారం - ఒక టీస్పూను


తయారుచేసే విధానం.. 


బంగళాదుంపల పొట్టు తీసేసి ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, క్యాప్సికమ్ లను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టాలి. అలాగే వాటిని ఒక గిన్నెలో వేసి అందులో శెనగపిండి, నీళ్లు పోసి బాగా కలపాలి. ఉప్పు, కారం కూడా అందులో చేర్చి పకోడీ వేసుకోవడానికి వీలుగా దీనిని కలుపుకోవాలి. అవసరమైనాన్ని నీళ్లు కలిపి ఆ పకోడీ పిండిని బాగా వేయించిన నూనెలో పకోడీల్లా వేసుకోవాలి. అంతే.. టేస్ట్ వెజిటేబుల్ వేడి వేడి పకోడీలు రెడీ.. 


మరింత సమాచారం తెలుసుకోండి: