ఆలూ కోఫ్తా కర్రీ చాలా తక్కువ మంది వినివుంటారు. ఈ కూరను బంగాళాదుంపతో చేస్తారు. బంగాళాదుంపతో ఎన్నో రకాల వంటలను చేస్తుంటారు.. పిల్లలకు ఇష్టమైన స్నాక్స్ ఐటమ్స్ నుంచి పెద్దలు ఇష్టం ఉన్న కర్రీస్ వారు అన్ని ఎంతో రుచికరంగా చేసుకుంటుంటారు. అయితే అన్ని రుచికర వంటల్లో భాగమే ఆలూ కోప్తా కర్రీ కూడా. ఎంతో రుచికరమైన కూర పేరు ఏ ఇప్పుడు వింటున్నాం.. ఇంకా ఈ కూర ఎలా చెయ్యాలో ఎలా తెలుస్తుంది. అందుకే ఎంతో రుచికరమైన ఈ కూరను ఎలా చేసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకోండి...  

 

కోఫ్తాకు కావలసిన పదార్థాలు :

 

బంగాళదుంపలు : ఉడికించి పెట్టుకున్నవి అరకిలో

 

ఉల్లిపాయ : ఒకటి (ముక్కలుగా చేసుకొని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి)

 

కారంపొడి : రుచికి సరిపడ

 

పసుపు: టేబల్‌ స్పూను

 

ఉప్పు : రుచికి సరిపడ

 

కొత్తిమీర : కొంచెం

 

కూరకు కావలసిన పదార్థాలు...

 

కారంపొడి : టేబుల్‌ స్పూను


ఎండు మిరపకాయల ముక్కలు : పావు టీస్పూను


ఉప్పు: సరిపడ


నీరు: ఒకటిన్నర కప్పు


దాల్చిన చెక్క – చిన్న ముక్క


లవంగాలు – 2


నూనె: తగినంత


ఉల్లిపాయ : పెద్దది 1


అల్లం వెల్లుల్లి పేస్ట్ : రెండు స్పూన్లు


టమొటా పేస్ట్ : రెండు టేబుల్‌ స్పూన్లు


క్రీము : రెండు టేబుల్‌ స్పూన్లు


కొత్తిమీర : కొంచెం

 

తయారీ విధానం... 

 

ఓ గిన్నెలో కోఫ్తా కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి బాగా కలిపి చిన్న చిన్న వుండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో నూనె పోసి కోఫ్తాలు ఒక్కొక్కొటి చొప్పున అన్నీ దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. కప్పు నీటిలో కారం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కోఫ్తాలు వేయించిన తర్వాత అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరికొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత దీనికి టమోటా ప్యూరీ కూడా కలిపి నూనెపైకి వచ్చేవరకు వేయించిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కారపు నీటిని పోసి కొద్ది సేపు ఉడకనివ్వలి. ఓ పదినిమిషాల తరువాత క్రీము జతచేస్తూ బాగా కలపాలి. ఆతర్వాత అందులో కోఫ్తాలు కూడా వేసుకోవాలి. అన్నీ కలిపి మరికొద్దిసేపు ఉడికించి దించే ముందు కొత్తిమీర చల్లుకొని దించేయాలి.అంతే రుచికరమైన కోప్తా కర్రీ రెడీ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: