ప్రెగ్నన్సీ అనేది.. చాలా విభిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది. పెయిన్, గెయిన్ రెండింటితోనే డీల్ చేయగలగాలి. వాస్త‌వానికి నేటితరంలో కొందరు “ఆ! ఆ నొప్పులు, ఆందోళన ఎవరు పడతారు?” అని ఆపరేషన్ కావాలని కోరుకుంటున్నారు. కానీ సహజంగా జరిగే డెలివరీ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఆరోగ్యంగా ఉన్న స్త్రీ ప్రసవ వేదన ఎక్కువ లేకుండా, సునాయాసంగా కనవచ్చని మన పూర్వికులు రుజువు చేశారు. నార్మ‌ల్ డెలివ‌రీ తరువాత కోలుకోవటం సులభం. అలాగే సహజమైన డెలివరీ వల్ల పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ  బాగా ఉంటుంది. 

 

అయితే నార్మల్ డెలివరీ అవడం వల్ల ఫ్యూచర్ లో కూడా చాలా సమస్యలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇన్ని లాభాలున్నప్పుడు సహజమైన డెలివరీ కోసం కొన్ని చిట్కాలు, ఆరోగ్య సూత్రాలు, వ్యాయామాలు పాటించాలి. అలాగే ఈ చిన్న ట్రిక్ పాటించ‌డం ద్వారా నార్మ‌ల్ డెలివ‌రీకి స‌హాయ‌ప‌డుతుంద‌ట‌. మ‌రి అదేంటో ఓ లుక్కేయండి.. పూర్వం పప్పు కావాలన్నా, పిండి కావాలన్న విసురాళ్లే (తిరగలి)  వాడేవారు. రోజుకో సారి ఇసుర్రాయి తో పనిపడేది అప్పటి మహిళలకు. అయితే ఇసుర్రాయి తిప్పే టప్పుడు పొట్ట మీద ఒత్తిడి కలుగుతుంది. 

 

ఈ సమయంలో పొట్టలో సంకోచ వ్యాకోచాలు జరుగుతాయి. పొట్టలో ఉండే గర్భసంచికి కూడా కదలిక ఉంటుంది. పైగా నడుము పై భాగమంతా రౌండ్ గా తిరగడం వల్ల, పక్కటెముకలు ఫ్రీగా అవుతాయి. ఈ కారణాల రిత్యా ప్రసవ సమయంలో సిజేరియన్ అవసరం లేకుండా సహజ ప్రసవం జరుగుతుంద‌ట‌. ఇలా పుట్టిన పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. పూర్వం ఆపరేషన్ అనేదే లేకుండా.. ఒక్కొక్క తల్లి ఐదు, ప‌ది మంది పిల్లలకు ఎలా  జన్మనివ్వడానికి ఇదే ప్రధాన కారణం. అయితే గర్బిణీ లు ఆరేడు నెలల వరకు ఇసుర్రాయిని తిప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: