బంగారం అంటే ఎవరికీ  ఇష్టం ఉండదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహిళలు, సాంప్రదాయ కుటుంబాలే కాదు.. ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు కూడా బంగారం కొనడానికి ఇష్టపడుతారనేది కాదనలేని వాస్తవం. అన్నివర్గాలను దృష్టిలో పెట్టుకొని సరసమైన ధరకు నాణ్యమైన బంగారాన్ని వినియోగదారులను అందించే విషయంలో కల్యాణ్ జ్యువెలర్స్ దూసుకెళ్తున్నది. 110 ఏళ్లకుపైగా వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబాలు వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాపారంలో ముందుకెళ్తున్నది. కల్యాణ్ జ్యువెలర్స్ ప్రత్యేకత బంగారం అమ్మకాల్లో కల్యాణ్ జ్యువెలర్స్ తమ వ్యాపారంలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తున్నది. 

 

ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొనే కల్యాణ్ జ్యువెలర్స్ ప్రస్తుతం ట్రెండింగ్‌గా ఉన్న టెంపుల్ జ్యువెలరీపై దృష్టిపెట్టింది. టెంపుల్ జ్యువెలరీ... దేశంలోని ఆలయాలు, ముఖ్యంగా దక్షిణాదికి ప్రాంతానికి చెందిన దేవాలయాలకు ప్రతీకగా నిలిచే బంగారు ఆభరణాల కలెక్షన్స్‌ను వివాహ సీజన్‌లో అందుబాటులోకి తెచ్చింది. టెంపుల్ జ్యువెలరీ ప్రత్యేకత ఏమిటంటే.. వివిధ రకాలైన దేవతలు, దేవతామూర్తుల ఆకృతులు, ఆలయ డిజైన్లు వంటి అద్భుతమైన పనితనంతో మగువల మనసు దోచుకునే ఆభరణాలను అద్భుతమైన డిజైన్లతో రూపొందిస్తున్నది. చక్కగా సాంప్రదాయబద్ధంగా, సాంస్కృతిక వారసత్వంగా అనిపించే టెంపుల్ జ్యువెలరీ వివిధ రకాల విలువైన విలువైన రాళ్లతో ఆభరణాలు ఉండేలా,  జ్యువెల్లర్స్ జాగ్రత్తలు తీసుకొంటున్నది. టెంపుల్ జ్యువెలరీ ప్రత్యేక డిజైన్లలో సహజంగా టెంపుల్ జ్యువెలరీ మంచి ఫినిషింగ్‌తో వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నారు. తంజావూరు, ఇతర ప్రాచీన ఆలయాలు ఈ ఆభరణాల డిజైన్లకు మూలంగా తీసుకొంటున్నారు. 

 

దక్షిణ భారతదేశం యొక్క గొప్ప శిల్పకళా నైపుణ్యం గల ఆలయాలలోని అపురూపమైన డిజైన్లు ఈ ఆభరణాల రూపకల్పనలో ప్రధానంగా కనిపిస్తాయి. చాలా క్లిష్టమైన పనితనంతో చూడగానే మనసుకు నచ్చే టెంపుల్ జ్యువెలరీ ప్రస్తుతం వివాహాదితోపాటు ఇతర శుభకార్యాలలో మంచి ట్రెండ్‌గా కనిపిస్తుంది. మగువలను ఆకట్టుకొంటున్న టెంపుల్ జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీకి నాణ్యమైన కెంపులు, పచ్చలు, ముత్యాలు, వజ్రాలు, వైడూర్యాలను ఊపయోగిస్తున్నారు. అభరణాలకు మరింత క్లాసిక్ లుక్ ఇవ్వటానికి ఉపయోగిస్తారు. చెవి పోగులు, కంఠాభరణాలు, నెక్లెస్ లు, లాంగ్ హారాలు, గాజులు, వడ్డాణాలు ఇలా ఒకటేమిటి టెంపుల్ జ్యువెలరీ ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టు తయారు చెయ్యబడుతుంది. అయితే ఇవి కొనే ముందు ఒక్క నిముషం ఆలోచించి కొనండి టెంపుల్ జ్యూల‌రీ అనేది చాలా మంది కొంటుంటారు కానీ అవి కొంద‌రికి మాత్ర‌మే క‌లిసొస్తాయి అందరికీ క‌లిసిరావు అలాగే కెంపులు, ప‌చ్చ‌లు అనేది ఎవ‌రిన‌న్నా సంప్ర‌దించి తీసుకోవ‌డం చాలా మంచిది వాటిని ధ‌రించే ముందు అవి ధ‌రించ వ‌చ్చా లేదా అన్న‌ది తెలుసుకోవాలి. అదే విధంగా వాటిని కొన్న వెంట‌నే ధ‌రించ‌కూడ‌దు దానికి సంబంధించి శివాల‌యంలో పూజ‌లు చేయించి ధ‌రిస్తే మంచిదంటున్నారు కొంద‌రు పెద్ద‌లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: