కావాల్సిన‌ పదార్థాలు:
బియ్యం- ఒక క‌ప్పు
పెసరపప్పు- ఒక క‌ప్పు
బెల్లం- రెండు క‌ప్పులు

 

నెయ్యి- అర క‌ప్పు
నీళ్ళు- నాలుగున్న‌ర క‌ప్పులు
ఎండుకొబ్బరి ముక్కలు- అర‌క‌ప్పు

 

ఏలకుల పొడి- అర టేబుల్ స్పూన్‌
జీడిపప్పు- కొద్దిగా
కిస్‌మిస్‌- కొద్దిగా


తయారీ విధానం:
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో నెయ్యి మొత్తాన్ని వేసుకోవాలి. అందులో ఎండుకొబ్బరి ముక్కలను కొంచెం ఎర్రగా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకుని దానిలోనే జీడిపప్పు, కిస్‌మిస్‌ కూడా వేసి వేయించి గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న గిన్నె తీసుకొని బియ్యం, పెసరపప్పు కలిపి కడిగి నాలుగున్నర కప్పుల నీరు పోసి స్టౌ మీద పెట్టుకోవాలి. దానిని అన్నం వండినట్లుగానే ఉడికించుకోవాలి. అన్నం మొత్తం పలుకు లేకుండా ఉడికించి ఎసరు లేకపోతే కొంచెం నీరు పోసుకోవాలి.

 

అలాగే కొంచెం నీరు ఉన్నప్పుడే దానిలో బెల్లం తురుము వేసి కరిగేదాకా కలుపుతూ అడుగు అంటకుండా చూసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్‌మిస్‌తో పాటుగా నెయ్యి వేసి బాగా కలిపి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన పెసరపప్పు పొంగలి రెడీ. దీన్ని వేడి వేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి..!

మరింత సమాచారం తెలుసుకోండి: