ఈ మధ్య కాలంలో  స్త్రీలపైనా ఎన్నో నేరాలు ఘోరాలను మనం చూస్తున్నాం అందులో ఒకటైన నిన్న జరిగిన   హైదరాబాద్ లోని శంషాబాద్ పరిధిలో అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంకారెడ్డి ఘటన. ప్రసార మాధ్యమాలలో తెలిపిన సమాచారం మేరకు ఆమె పని నిమిత్తం బయటకు వెళ్లి ఇంటికి తిరుగు వచ్చే సమయం లో జరిగిన సంఘటన ఇది. ఏమి తెలియని స్థితిలో తన సోదరికి ఫోన్ చేసిన తరువాత వారి తన తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చిన తరువాత కూడా పోలీసులకు ఆమె ఉన్న ఏరియా ఏ పొలిసు పరిధిలోనిది అని తెలుసుకొని ఆ పిర్యాదు  పైన చర్య తీసుకునే లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయంది.

 

అయితే ఎప్పటినుండో   సరిహద్దులతో సంబంధం లేకుండా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు కేసు    నమోదు చేసి దర్యాప్తు చేయాలన్న  డిమాండ్ మళ్లీ తెర పైకి వచ్చింది.   ప్రియాంక రెడ్డి హత్య నేపథ్యంలో తాజాగా ఈ డిమాండ్ ఊపందుకుంది. సాధారణంగా పోలీసులు ఏమైనా ప్రమాదం కానీ ఏదైనా హత్యాగాని జరిగినప్పుడు  కేసు నమోదు సమయంలో పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకునేది ఘటన జరిగిన ప్రాంతం  ఎవరి పొలిసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది తమ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందా , రాదా  అన్న విశ్లేషణ చేసుకున్న తరువాతనే దర్యాప్తు చేయడం కేసు నమోదు చేయడం జరుగుతుంది ఆలోపే జరగాల్సిన ఘోరాలు జరిగిపోతున్నాయి.

తమ పరిధిలోకి వస్తేనే కేసు నమోదు చేస్తారు. లేదంటే పలానా స్టేషన్‌కు వెళ్లాలని చెబుతారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధన వల్ల నిండు ప్రాణాలే బలికావచ్చు.  ఉదాహరణకు ప్రియాంకారెడ్డి ఘటనే సాక్షం ఆమె  ఆపదలో ఉన్నానని ఇంటికి ఫోన్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు కానీ ఆ ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుందో కనుక్కునే లోపే జరగాల్సింది జరిగిపోయంది. ఇది జరిగిన తరువాత ప్రియాంక తండ్రి మాట్లాడుతూ శంషాబాద్ ఆర్జీఐఏ, శంషాబాద్ రూరల్ పోలీసులు తమ పరిధి కాదంటే తమ పరిధి కాదంటూ పోలీసులు నిర్లక్ష్యం గా  వ్యవహరించారు అని అతను  పిర్యాదు ఇచ్చిన వెంటనే స్పందించి ఉంటే తన కుమార్తె బతికేదని ప్రియాంక తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ జీరో ఎఫ్ఐఆర్ డిమాండ్ ఊపందుకుంది. ప్రియాంకారెడ్డి ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని కుటుంబ సభ్యులతోపాటు నిపుణులు సూచిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: