పెసరపప్పుతో మనం ఎన్నో రకాల వంటలు చేయొచ్చు. పెసరపప్పు లో ప్రోటీన్స్ మరియు పిండిపదార్ధాలు ఉంటాయి. ఇవి శరీరానికి సరిపడా శక్తిని సమకూరుస్తాయి.


ఇప్పుడు పెసరపప్పుతో ఒక అద్భుతమైన,   రుచికరమయినా స్వీట్ ఎలా చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్.


కావాల్సిన పదార్దాలు ఏంటో చూద్దామా !!
1)పెసరపప్పు -1 కప్
2)పాలు -1 కప్
3)పంచదార -1 కప్
4) నెయ్యి -రుచికి సరిపడా
5)బొంబాయి రవ్వ 1/2 కప్
6)నూనె - 1/3 కేజీ
7)నీరు - సరిపడా

తయారీ విధానం :
ఇపుడు తయారీవిధానం ఎలానో చూద్దామా ఫ్రెండ్స్.
ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి పెసరపప్పు ని దొరగా వేయించాలి. పచ్చి వాసన పోయేదాకా వేయించాలి.... పప్పు వేగాక తీసివేసి ఒక బౌల్ లో వేయాలి.. అదే పాన్ లో కొద్దిగా పాలు మరియు నీరు పోసి కాగనివ్వాలి. అలా కాగిన పాలలో వేయించిన పెసరపప్పు ని వేసి మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించిన పప్పుని మిక్సీ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కనపెట్టుకోవాలి..


   పాన్ లో మిగిలిన పాలు పోసి, అందులో బాబాయిరవ్వ వేసి తిప్పుతూ ఉండాలి.. కొంచెం గట్టిపడ్డాక మెత్తగా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు మిశ్రమం ని వేయాలి. దీనికి కొంచెం నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి. చపాతీ పిండి ముద్ద మాదిరిగా వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి. కొంచం చల్లారాక చిన్న ఉండలుగా చేసుకుని చేతితో చిన్న సైజ్ బిస్కట్స్ మాదిరిగా ప్రెస్ చేసుకోవాలి. మరీ చెక్కలు లాగా పలచగా చేయకూడదు. కొంచెం మందం గా ఉండాలి.. ఎందుకంటే మందంగా ఉంటే పాకం లో వేయగానే పాకం స్వీట్ కి పడుతుంది.


ఇపుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో వేపడానికి సరిపడా నూనె వేసి బాగా కాగనివ్వాలి. నూనె కాగాక అందులో మనం ముందుగా చేసుకున్న బిస్కెట్స్ వేయాలి.. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి.. ఇంకోపక్క స్టవ్ మీద గిన్నె పెట్టి 2 కప్స్ నీరు మరియు1 కప్ పంచదార వేసి పాకం పట్టాలి. పాకం మరీ తీగ పాకం లాగా రాకూడదు.. యాలుక్కాయ పొడి వేయాలి దీనివల్ల స్వీట్ కి మంచి వాసన వస్తుంది. కొంచెం జ్యుసీ గా ఉండాలి.. వేళ్ళతో పట్టుకుంటే జిగట గా ఉంటే చాలు. ఇపుడు ముందుగా వేయించిపెట్టుకున్న రౌండ్ షేప్ బాల్స్ ని పాకంలో వేసి ఒక గంట పాటు ఉంచాలి. ఇపుడు పాకం బాగా పట్టిద్ది స్వీట్ కి.


జ్యుసీ జ్యుసి గా, క్రిప్సీ క్రిప్సి గా ఉండే పెసరపప్పు స్వీట్ రెడీ.. ఇది తింటే గులాబ్జామ్ స్వీట్ గుర్తుకువస్తుంది. అంత బాగుంటుంది మరి.. ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే తయారుచేసి మీ కుటుంబసభ్యులకు తినిపించేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: