కొబ్బరి ఆరోగ్యానికి మంచిది.. కేవలం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా కొబ్బరి ఎంతో మంచిది. అయితే ఇన్ని రకాల ప్రయోజనాలు అందించే కొబ్బరితో టమోటా కలిస్తే.. రుచి అదిరిపోతుంది. ఆ రుచి గురించి చెప్పేలేము.. అయితే ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి టమోటా చట్నీ ఎలా చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు. అయితే ఇప్పుడు ఈ కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

              

కావలసిన పదార్థాలు.. 

         

ఎర్రటి టమోటాలు - ఒక కిలో, 

            

పచ్చికొబ్బరి కోరు - ఒక కప్పు, 

 

పాలు - ఒక కప్పు,

 

పంచదార - ఒకటిన్నర కప్పు, 

 

దాల్చిన చెక్క - అంగుళం ముక్క, 

 

కరివేపాకు - 4 రెబ్బలు, 

 

ఎండు మిర్చి - 4, 

 

పోపు గింజలు - ఒక టీ స్పూను, 

 

పోపుకు తగినంత నూనె.

 

తయారీ విధానం.. 

 

టమోటాలను శుభ్రంగా కడిగి నాలుగేసి ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. స్టౌవ్‌పైన గిన్నెపెట్టి నూనె వేడయ్యాక ఎండుమిర్చి, పోపు గింజలు వేసి అవి వేగాక, కప్పునీటిని జతచేయాలి. నీళ్లు మరుగుతుండగా టమోటా ముక్కల్ని వేసి నీరు ఇంకిపొయ్యేంత వరకూ మెత్తగా ఉడికించాలి. మంటను తగ్గించి పంచదారను, పాలను వేసి కలపాలి. పంచదార కరిగేదాకా తిప్పుతూనే ఉండాలి. కొబ్బరి తురుమును  కూడా కలిపి మరోసారి తిప్పాలి. మరో ఐదు నిమిషాల పాటు ఉడికించి దించాలి. చల్లారాక పూరీ లేదా పరోటాలతో ఈ కొబ్బరి టమోటా చట్నీ తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాదు ఈ చట్నీని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: