శీతాకాలంలో వచ్చే చల్లని గాలులు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి కానీ ఆ గాలి ప్రభావం మన సున్నితమైన చర్మం మరియు పెదవులు, ముఖం, చేతులు, పాదాల మీద ప్రభావం చూపుతాయి. ఈ కాలంలో చర్మం పొడిబారిపోవడం, పాదాలు, పెదవులు పగుళ్లు ఎక్కువ ఉంటాయి . శీతాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంద వికారంగా ఉన్న మన చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.

  ఒక శీతాకాలం మాత్రమే కాకుండా ఎ కాలంలో అయినా మన చర్మ సంరక్షణ చూసుకోవాలి. శీతాకాలంలో ముఖానికి మాయిశ్చరైజర్ వాడాలి.. డ్రై స్కిన్ వారు చాలా జాగ్రత్తగా మెలగాలి. ఈ కాలంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. అందుకని చర్మం కూడా ఈ శీతాకాలంలో పొడిబారిపోతుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి అంత ప్రమాదం లేదు కాని పొడి చర్మం ఉన్నవారు జాగ్రత్త తీసుకోవాలి.

కొన్ని చిట్కాలు పాటించడం వల్ల శీతాకాలంలో చర్మ సంరక్షణ ఎలా కాపాడుకోవాలో చూద్దాం. స్నానం చేయడం, రాత్రిపూట చలి నుంచి చర్మాన్ని ముఖ్యంగా పెదవులను, పాదాలను  కాపాడుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం చేయాలి. విటమిన్స్, మినరల్స్ ఉన్న ఆహారం తినాలి. వింటర్ స్కిన్ కేర్ లాంటివి వాడాలి. ఉదాహరణకు వాసిలిన్ లేదా పెట్రోలియం జెల్లీ రాసుకుని గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే శరీరం మృదువుగా ఉంటుంది. నువ్వుల నూనె చలికాలంలో చక్కగా పనిచేస్తుంది ఈ  నూనెని శరీరానికి పట్టించి సున్ని పిండితో స్నానం చేస్తే చర్మం సున్నితంగా అవుతుంది. ఉదయం గోరువెచ్చని నీటిలో స్నానం చేశాక ముఖానికి క్రీమ్ రాసుకోవడం మరిచిపోవద్దు. ముఖ్యంగా "E" విటమిన్ క్రీములు వాడటం మంచిది.

శీతాకాలంలో చర్మం పగుళ్లు ఎక్కువగా ఉంటాయి అందుకే రాత్రి పడుకునే ముందు వాసిలిన్ రాసుకోవాలి. సాధారణ సబ్బులు కన్నా గ్లిసరిన్ ఉన్న సబ్బులు వాడడం మంచిది. చలికాలం కాళ్ళకి సాక్సులు వేసుకుంటే మంచిది. చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి నీరు ఎక్కువ తాగాలని పించదు. దీంతో మన శరీరంలో నీటి శాతం కూడా తగ్గిపోతుంది దీంతో చర్మం పొడిబారిపోతుంది. చలికాలం లో మహిళలు ఎన్ని క్రీమ్స్ రాసిన, ఎన్ని ఫేసియల్స్ వాడిన లాభం ఉండదు. కావున వీలయినంత ఎక్కువ నీరు తాగాడం మంచింది. వారానికి ఒక్కసారి అయినా ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. పెదవులు పగలకుండా  లిప్ బాల్మ్ గాని వెన్నపూస గాని రాయాలి. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. అందమైన చర్మం మీ సొంతం అవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: