'దిశ 'కి జరిగిన అన్యాయం మరి ఏ ఆడపిల్లకి జరగకూడదు... 'దిశ'  బైక్ టైర్ పంక్చర్ అయినపుడు దిశ వాల్ల సిస్టర్ కి కాల్ చేసి బైక్ టైర్ పంక్చర్ అయింది. ఏలా రావాలో ఇంటికి అర్ధం కావటంలేదు. నాకు భయం గా ఉంది ఇక్కడ చుట్టూ ఉన్నవాళ్ళని చూస్తే భయం వేస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇదే... దిశ నుంచి వాల్ల చెల్లి కి వెళ్లిన చివరి ఫోన్ కాల్.. తరువాత వాల్ల సిస్టర్ దిశ ఫోన్ కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది..

తెల్లారేసరికల్లా బూడిద అయ్యి కనిపించింది. అసలు దిశ ఫోన్ ఏమయినట్లు?


ఈ  కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేసారు. కేసులో కీలకమైన ఫోన్ ను కనిపెట్టామని తెలిపారు. చర్లపల్లి జైల్లో ఉన్న ఆ నలుగురు ఖైదీలను విచారణ చేస్తున్నారు.. దిశ హత్య జరిగాక ఫోన్ ఏమైంది అన్నా  ప్రశ్న మిస్టరీ గా మారింది.

హంతకులు ఫోన్ ను 'దిశ' ని తగలబెట్టిన మంటలలో పడవేశారు అని అనుకున్నారు. కాని అలా జరగలేదు. "ఘటన జరిగిన తర్వాత బాధితురాలి ఫోన్ ని సంఘటన జరిగిన స్థలములోనే గొయ్యి తీసి మట్టిలో పూడ్చిపెట్టామని"  నిందితులు తెలిపారని చెప్పారు.. ఫోన్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.. కాల్ లిస్ట్, మెసేజెస్, కాల్ రికార్డింగ్ ద్వారా మరిన్ని ఆధారాలు దొరుకుతాయేమో అన్న దిశగా దర్యాప్తు ముమ్మరం చేసారు.


బాధితురాలని బ్రతికి ఉండగానే పెట్రోల్ పోసి సజీవదహనం చేసినట్లు నిందితుల్లో ఒకరు తెలిపారు. నిందితుల్ని వేరు వేరు గా ప్రశ్నించి విచారణ చేబడుతున్నామని తెలిపారు. పోలీసులకి ఈ కేసు ఒక సవాల్ గా మారింది. దిశ హత్యకేసు దేశం అంతా ఒక ప్రకంపనలు సృషించింది.. 'దిశ 'లా వేరే అమ్మాయి బలి కాకుండా చట్టాలు శిక్షలను కఠినతరం చేయాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: