పన్నీర్ కర్రీ.. ఎంతో మందికి ఇష్టం.. శాకాహారులు అయితే పన్నీర్ కర్రీని ఎంతో రుచిగా వెరైటీగా చేసుకొని తింటారు. అయితే అలా వారు రకరకాలు చేసుకునే సమయంలోనే పాలక్ పన్నీర్, పన్నీర్ బట్టర్ మసాలా, స్పైసి పన్నీర్ ఇలా పలు రకాల రెసిపీస్ ని కనిపెట్టారు. అయితే ఈ పాలక్ పన్నీర్ తో క్యాప్సికం పాలక్ పన్నీర్ కర్రీ చేస్తే అదిరిపోతుంది. 

 

అయితే ఈ పాలక్ పన్నీర్ క్యాప్సికం కర్రీ ఎలా చెయ్యాలో చాలామందికి తెలియదు. అలాంటి వారంతా ఇక్కడ ఎలా చెయ్యాలో చదివి పాలక్ పన్ని క్యాప్సికం కర్రీని ఇళన్తో చేసుకోండి. ఈ కర్రీ చపాతీలోకి తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి.  

 

కావలసిన పదార్థాలు... 

 

చిన్న సైజు క్యాప్సికం - 8, 

 

నూనె - 1 టేబుల్‌ స్పూను, 

 

ఉప్పు - 1 టీ స్పూను. 

 

తురిమిన పనీర్‌ - 1 కప్పు, 

 

టమోటాలు- 2, 

 

ఉల్లిపాయ -1, 

 

క్యారెట్‌ - 1, 

 

బీన్స్‌ - 7, 

 

పచ్చిబఠాణి - గుప్పెడు, 

 

జీలకర్ర - 1 టీ స్పూను, 

 

అల్లం - అంగుళం ముక్క, 

 

పసుపు - అర టీ స్పూను, 

 

పచ్చిమిర్చి - 3, 

 

దనియాలపొడి - 2 టేబుల్‌ స్పూన్లు, 

 

కొత్తిమీర - 1 కట్ట, 

 

గరం మసాల - 1 టీ స్పూను, 

 

నూనె - 1 టేబుల్‌ స్పూను, 

 

ఉప్పు - రుచికి తగినంత.

 

తయారీ విధానం...

 

క్యాప్సికం తొడిమ, గింజలు తీసేసి, ఉప్పు కలిపిన నూనెను లోపలి అంచులకు రాసి ‘ప్రీ హీట్‌’ చేసుకున్న ఓవెన్‌లో 10 నిమిషాలు ఉంచాలి. కడాయిలో జీలకర్ర వేగాక, ఉల్లి, టమోటా, అల్లం, బఠాణి, బీన్స్‌, క్యారెట్‌ తరుగు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి. ఇప్పుడు పొడులన్నీ వేసి అరకప్పు నీటిలో ఉడికించాలి. నీరు ఇగిరిపోయాక పనీర్‌ వేయాలి. రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లి దించేసి, క్యాప్సికంలో కూరి, ఓవెన్‌లో మరో 5 నిమిషాలు ఉంచాలి. అన్నంతో కలుపుకున్నా, నంజుకున్నా చాలా రుచిగా ఉంటాయివి.

మరింత సమాచారం తెలుసుకోండి: