కావాల్సిన ప‌దార్థాలు:
కొబ్బరి తురుము- ఒక కప్పు
పైనాపిల్ తురుము- ఒక‌ కప్పు
నెయ్యి- త‌గినంత‌

 

కండెన్స్‌డ్‌ మిల్క్‌- ఒక‌ కప్పు 
యాలకుల పొడి- ఒక‌ టీస్పూను
పంచ‌దార‌- అర‌ క‌ప్పు

 

జీడిప‌ప్పు- కొద్దిగా
బాదంప‌ప్పు- కొద్దిగా
కిస్‌మిస్‌- కొన్ని

 

తయారీ విధానం: 
ముందుగా పాన్ పెట్టుకొని.. అందులో కొద్దిగా నెయ్యి వేసి జీడిప‌ప్పు, బాదంప‌ప్పు మ‌రియు కిస్‌మిస్ వేసి వేయించి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో నెయ్యి వేడిచేసి తరిగిన పైనాపిల్‌ వేసి దోరగా వేగించాలి. వీటిని ప్లేట్‌లోకి తీసుకుని కొబ్బరి తురుము కూడా ఇలాగే వేగించి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కడాయిలో వేసి కండెన్స్‌డ్‌ మిల్క్‌, పంచ‌దార వేసి చిన్న మంట మీద పాలు ఇగిరిపోయి ముద్దలా తయారయ్యేవరకూ ఉడికించాలి. 

 

త‌ర్వాత అందులో యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టౌ ఆప్ చేయాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండ‌లు చుట్టుకుని చివ‌రిగా జీడిప‌ప్పు, బాదంప‌ప్పు మ‌రియు కిస్‌మిస్‌తో గార్నిష్ చేసుకుంటే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ పైనాపిల్‌ కోకోనట్‌ లడ్డు రెడీ. పైనాపిల్‌, కోకోన‌ట్ రెండూ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక ఈ రెండిటి కాంబినేష‌న్‌లో ఈ రెసిపీ కూడా ఎంతో మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: