కొబ్బరి ఆరోగ్యానికి మంచిది.. కేవలం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా కొబ్బరి ఎంతో మేలు. అయితే ఇన్ని రకాల ప్రయోజనాలు అందించే కొబ్బరితో పులుసు చేసుకుంటే.. ఎంత రుచిగా ఉంటుంది. ఆ రుచి గురించి చెప్పేలేము.. అయితే ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి పులుసుని ఎలా చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు. అసలు కొబ్బరి పులుసు అనేది ఉంటుంది అనేది కూడా చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు ఈ నోరు ఊరించే కొబ్బరి పులుసు ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఏంటో తెలిస్తే రక్తం ఉడికిపోతుంది!!

 

కావలసిన పదార్థాలు... 

 

కొబ్బరి పాలు - 2 కప్పులు, 

 

నీరు - అర లీటరు, 

 

పచ్చిమిర్చి - 4 ,

 

అల్లం వెల్లుల్లి - 1/2 టీ స్పూను, 

 

ఏలకులు - 4, 

 

లవంగాలు - 4, 

 

లోటస్‌ ఫ్లవర్‌ గరం మసాలా - 2 స్పూన్లు, 

 

నెయ్యి - 1 టేబుల్‌ స్పూను, 

 

ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర - తగినంత.

 

దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఏంటో తెలిస్తే రక్తం ఉడికిపోతుంది!!

 

తయారీ విధానం..

 

ఒక గిన్నెలో నెయ్యివేసి వేడిచేశాక ఏలకులు, లవంగాలు, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేయాలి. అవి వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు మరిగించాలి. తర్వాత చిక్కని కొబ్బరి పాలు పోసి కొత్తిమీర వేసి దించేయాలి.  అంతే ఇలా ఈ కొబ్బరి పులుసు చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ కొబ్బరి పులుసు తినే కొద్ది తినాలి అనిపిస్తుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే కొబ్బరి పులుసు చేసుకొని కడుపునిండా లాగించేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: