కేరళ లోని కాన్పూర్ లోని కుంధార ప్రాంతంలో షాజీరా(40) అనే మహిళ ఒంటరిగా ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. షాజీరా నివాసం ఉంటున్న దగ్గర ప్రాంతంలోనే అనీష్ కుట్టి (31) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అనీష్ కన్ను పక్కింటి మీద ఉన్న షాజీరా మీద పడింది. ఇద్దరికి వయసులో 10 సంవత్సరాల తేడా ఉంది.. కాని అనీష్ మాత్రం షాజీరా మీద ఇష్టం పెంచుకున్నాడు.

 


షాజీరా ఇద్దరు పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు.. షాజీరా ఒక్కటే ఉంటుంది ఇంట్లో.. అది అదునుగా తీసుకుని మాట మాట కలిపి షాజీరా ని లొంగతీసుకున్నాడు. పిల్లలు స్కూల్ కి వెళ్లిన వెంటనే వీళ్ళ ఇద్దరి ప్రేమాయణం మొదలు అయ్యేది . కొన్నాళ్ల పాటు బానే సాగింది.. కాని షాజీరా మీద అనీష్ కి అనుమానం ఏర్పడింది.. వేరే వ్యక్తులతో చనువుగా ఉంటుందని అనుమానించాడు.. వీల్లద్దరి మధ్య చాలా సార్లు గొడవలు కూడా అయ్యాయని తెలిసింది.

 

అనీష్ కి షాజీరా తో వేరే ఎవరన్నా క్లోజ్ గా ఉంటే తట్టుకోలేకపోయేవాడట. అనుమానం తో చాలా సార్లు ఇరువురు పోట్లాడుకునేవారట... నాకు వేరే ఎవరితో ఏ సంబంధం లేదని, అనవసరంగా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు అని హెచ్చరించిందట. ఈ అనుమాన భూతం ఇంకా వదలక  మరింత కోపం పెంచుకుని అనీష్ ప్రియురాలిని చంపాలని చూశాడట.

 

అదే అదునుగా..  షాజీరా తన చిన్న కూతురుని స్కూల్ లో వదిలిపెట్టి తిరిగి ఇంటికి వస్తుండగా, తన ఇంటి దగ్గర సమీపంలో అనీష్ ని బైక్ మీద చూసింది.. అనీష్ జేబులో కత్తి ఉంది. కానీ అది షాజీరా గమనించలేదు. వీరిద్దరి మధ్య వాగ్వాదం మరింత పెరిగింది... అసహనం కోల్పోయిన అనీష్ జేబులో నుంచి కత్తి తీసి షాజీరాని అత్యంత కిరాతకంగా ఎద, ఛాతి, చేతులు, కాళ్ళు, పొట్ట ఇలా శరీరం మొత్తం కాళి లేకుండా పొడిచి మరి చంపాడు.

 

30 సార్లు కసి తీరా శరీరం మొత్తం పొడిచి పొడిచి మరి చంపాడు. ఇలా దాడి చేయడం వల్ల షాజీరా అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. దీన్ని చూసిన అందరు భయంతో ఏమి చేయాలో తెలియక అలా నుంచుని చూస్తూ ఉండిపోయారు తప్ప ఆపే ప్రయత్నం ఎవరు చేయలేదు. తర్వాత స్థానికులు కుందరా పోలీస్ లకు ఫిర్యాదు చేసారు.. అనీష్ మాత్రం తీరిగ్గా ఇంటికి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని బెదిరించి తాపీగా షాహీదా ని పొడిచి చంపిన కత్తి ని కడిగాడు... పోలీసులు షాజీరాని చంపిన స్థలానికి చేరుకొని హత్య చేసిన అనీష్ ని అరెస్ట్ చేసారు. అక్రమసంబంధం వల్ల ఈ హత్య చేసాడని తెలిపారు. ఇంకా విచారణ కొనసాగుతుందని కుంధార పోలీస్ స్టేషన్ సీఐ రమేష్ కుమార్ మీడియా కి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: